UPI transaction charges : చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. పెద్ద పెద్ద షాపిగ్ మాల్స్ నుంచి చిన్న బడ్డీ కొట్ల వరకు అంతా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలో డబ్బులు పంపుతున్నారు. అంతే షాపింగ్, సినిమాలు, ప్రయాణాలకు సంబంధించిన కూడా వీటి నుంచే లావాదేవీలు జరుపుతున్నారు. అయితే వీటి నుంచి డబ్బులు పంపుతుంటే ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ ఇక నుంచి ఛార్జీలు వీటిపై ఛార్జీలు విధించేందుకు ఆర్బీఐ రంగం సిద్ధం చేస్తోంది.
యూపీఐ బేస్డ్ గా ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పీపీఐలపైనా ఈ ఛార్జీలు విధించాలని ఆర్బీఐ భావిస్తోంది. యూపీఐ అధారిత లావాదేవీలపై కాకుండా.. ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు. అయితే వీటికి కూడా ఛార్జీలు చెల్లించాల్సిందేనట. ఇందుకు సంబంధించి ఆగస్టు 17న డిస్కషన్ పేపర్ ను విడుదల చేసింది. ఈ అంశంపై ప్రజల అభిప్రాయాలను కోరింది.
ఈ ఛార్జీల విధింపు అనేది అందరూ ఆమోదించే విధంగానే ఉంటుందని ఆర్బీఐ చెబుతోంది. ప్రస్తుతం కొన్ని ఆర్థిక సంస్ధలు ఐఎంపీఎస్ రుసుమును పెంచాయి. ఆర్బీఐ ప్రచురించిన నివేదికరలో బారోయే రోజుల్లో ఈ ఛార్జీలను నిర్వహిస్తుందని ప్రతిపాదించింది.
Read Also : Insta new features : ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లు!