Tees Maar Khan Movie Review : హీరో ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ కాంబోలో తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan Movie) ఆగస్టు 19న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటివరకూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ , కామెడీ ఎంటర్టైనర్, థ్రిల్లర్ మూవీలే ఎక్కువగా చేసిన ఆది ఈసారి మాత్రం పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్సియల్ మూవీతో ముందుకు వచ్చాడు. దర్శకుడు కళ్యాణ్ జీ గోగాన తీస్ మార్ ఖాన్ మూవీని తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ టీజర్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. ఆది సాయి కుమార్ ఈసారైన తన తీస్ మార్ ఖాన్‌గా ప్రేక్షకులను మెప్పించడా లేదా అనేది తెలియాలంటే వెంటనే రివ్యూలోకి వెళ్లిపోవాల్సిందే..

స్టోరీ లైన్ ఇదే (Movie Story) :
ఆది సాయి కుమార్ ఈసారి డిఫరెంట్ రోల్ ప్రయత్నించాడు. తీస్ మార్ ఖాన్ అనే ఒక కాలేజ్ స్టూడెంట్ పాత్రలో అద్భుతంగా నటించాడు. తన పోలీస్ కావాలనే కలను ఎలా నేరవేర్చుకుంటాడు అనేది అసలు స్టోరీ.. తీస్ మార్ ఖాన్ పోలీస్ గా మారే టైంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనేది చూడొచ్చు. ఇందులో ప్రధానంగా మాఫియా నుంచి కొంతమంది తీస్ మార్ ఖాన్ ను టార్గెట్ చేస్తాడు. ఆ క్రమంలో తీస్ మార్ ఖాన్ సోదరిని, ఆమె భర్తని కోల్పోతాడు. ఆ తర్వాత తీస్ మార్ ఖాన్ ఏం చేస్తాడు? మాఫియా డాన్ ఇదంతా ఎవరు చేయిస్తున్నారని తెలుసుకుంటాడు. తీస్‌మార్ ఖాన్ ఆ మాఫియాపై రివేంజ్ తీర్చుకుంటాడా? తన లక్షాన్ని చేరుకుంటాడా లేదో తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే.
నటీనటులు వీరే (Movie Cast) :
Movie Name : | Tees Maar Khan (2022) |
Director : | కళ్యాణ్ జీ గోగాన |
Cast : | ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ |
Producers : | నాగం తిరుపతి రెడ్డి |
Music : | సాయి కార్తీక్ |
Release Date : | 19, ఆగస్టు 2022 |
Tees Maar Khan Movie Review : సినిమా ఎలా ఉందంటే? :
సాయికుమార్ తనయుడిగా ఆది తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా నుంచి గుర్తింపు తెచ్చే మూవీలనే చేస్తూ వచ్చాడు. కానీ, కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ కొన్ని సినిమాల్లో ఆది తనదైన నటనతో మెప్పించి అభిమానులను మెప్పించాడు. తాను చేసే ప్రతి మూవీలో వేరియేషన్ చూపించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వచ్చిన ఆది మూవీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వచ్చింది.

ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ, మూవీ స్టోరీ మాత్రం కొత్తగా అనిపించలేదు. ఆది క్యారెక్టర్ లోనూ అనేక షేడ్స్ చూపించారు. సినిమా అంతా ఆదికి తన సోదరి మధ్య రిలేషన్‌పైనే సాగుతుంది. సోదరి సెంటిమెంట్ మూవీలు చాలానే వచ్చాయి. అలాంటి మూవీనే ఇది కూడా అనిపించేలా ఉంది. ఇక హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆదితో కెమెస్ట్రీ బాగానే ఉంది.
ఈ మూవీలో ఏదో హీరోయిన్ గ్లామర్ పాత్ర ఉండాలి అన్నట్టుగా అనిపించింది. మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే.. సందర్భం లేకుండానే పాటలు వస్తుంటాయి. స్టోరీ మధ్యలో పాటలను జొప్పించినట్టుగా అనిపించింది. కథనుగుణంగా పాటలను కూర్చినట్టుగా లేదు. ఇక టెక్నికల్ పరంగా చూస్తే మూవీ ప్రేక్షకులు చూడదగినట్టుగానే ఉంది. మూవీ స్టోరీకి సంబంధించి మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. ఇకపోతే నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇకపోతే రొటీన్ స్టోరీ, అక్కడక్కడ పాటలు, బలహీనమైన కథనం వంటివి ప్రేక్షకులను బోరింగ్ ఫీల్ అయ్యాలే ఉండటం మూవీకి మైనస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. టెక్నికల్ పరంగా మూవీ అద్భుతంగా వచ్చింది. కానీ, స్టోరీలో మాత్రం ఎక్కడ కూడా కొత్తదనం కనిపించలేదు. ఒకరకంగా చెప్పాలంటే.. కమర్షియల్ మూవీలను ఇష్టపడే ఆడియెన్స్, ఆది ఫ్యాన్స్ కు ఈ మూవీ బాగా నచ్చుతుంది. మిగతా ఆడియెన్స్ కూడా మూవీని ఓసారి చూసి రావొచ్చు.
[ Tufan9 Telugu News ]
తీస్ మార్ ఖాన్
మూవీ రివ్యూ & రేటింగ్ : 2.7/5
Read Also : Commitment Movie Review : ‘కమిట్‌మెంట్’ మూవీ రివ్యూ.. ఐదుగురు అమ్మాయిల ‘మీటూ’ పోరాటం..!