PM Kisan yojana: పీఎమ్ కిసాన్ డబ్బులు రాకపోవడానికి కారణం అదేనట..!

PM Kisan yojana: పీఎమ్ కిసాన్ యోజన లబ్ధిదారులకు ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. అయితే ఈ విషయం ఏమిటో తెలుసుకొని డబ్బులు మీ ఖాతాలో పడేలా చేస్కోండి. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 11వ విడత పీఎమ్ కిసాన్ యోజన డబ్బులను రైతుల ఖాతాలో వేయబోతుంది. కేవైసీని పూర్తి చేయడానికి గడువును కూడా పెట్టింది. అయితే ఈ కేవైసీ తప్పనిసరి. కేవైసీ గురించి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని కూడా కేవైసీని హాయుగా పూర్తి చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

కొంత కాలం క్రితం కిసాన్ యోజన పోర్టల్ లో ఈ కేవైసీ సదుపాయాన్ని నిలిపి వేసిన కేంద్ర ప్రబుత్వం… ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చింది. 11వ విడత డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేవైసీ ప్రక్రియ ఎలా చేసుకోవాలో ఇఫ్పుడు తెలుసుకుందాం.

Advertisement

మొబైల్ లేదా ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ సాయంతో ఇంట్లో కూర్చొని ఈ కేవైసీ చేయవచ్చు. దీని కోసం ముందుగా మీరు పీఎమ్ కిసాన్ పోర్టల్ కి వెళ్లి లాగిన్ అవ్వండి. అక్కడ ఈ కేవైసీ ఆప్షన్ క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేయాలి. బయోమెట్రిక్ ప్రక్రియ కోసం సమీపంలోని సీఎస్ సీ కేంద్రాలను సంప్రదించండి. అయితే ఇందుకోసం చివరి తేదీ మే 30, 2022 వరకు కొనసాగించారు.

Advertisement
Advertisement