Pizza: పిజ్జా ఆర్డర్ చేశాడు… రెండు ముక్కలు తినగానే గుండె ఆగిపోయింది!

Pizza: ఇష్టంగా ఆన్ లైన్ లో పిజ్జా ఆర్డర్ చేశాడు. ఆకలేస్తుందని… ఆవురావురు మంటూ రెండు ముక్కలు కొరికేశాడు. కానీ తిన్న వెంటనే గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగానే అతడు చనిపోయాడు. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై రేపు విచారణ ప్రారంభం కాబోతుంది. న్యాయం కోసం సదరు యువకుడి తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తు్నారు. ఇంతకీ విజయం ఏంటంటే… జేమ్స్ అట్కిన్ సన్ అనే యువకుడు ఇంగ్లండ్ లోని న్యూక్యాసిల్ లో నివసించే వాడు. న్యూక్యాసిల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్ లో నివాసం ఉండేవాడు. 2020 జులై 10న డడ్యాల్ అనే రెస్టారెంట్ నుంచి డెలివరీ యాప్ ద్వారా చికెన్ మసాలా పిజ్జాను ఆర్డర్ చేశాడు. రెండు ముక్కలు తినగానే గొంతు వాచిపోయి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి వెళ్లేలోపే చనిపోయాడు.

Advertisement

Advertisement

అయితే పోస్టుమార్టం చేసిన వైద్యులు… అతను గుండె పోటుతో చనిపోయాడని తెలిపారు. అలాగే అతనికి చిన్నప్పటి నుంచి పీనట్ అలర్జీ ఉందని…. పిజ్జాలో పీనట్ పొడి వాడడం వల్లే అతను చనిపోయాడని వివరించారు. అయితే ఈ రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు పెట్టారు. ఆ తర్వాత ఈ రెస్టారెంట్ ను కూడా మూసేశారు. కానీ ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతోంది.

Advertisement
Advertisement