Narendra Modi : దేశంలో స్వచ్చభారత్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ స్వచ్ఛ మిషన్ దేశంలోని నగరాలన్నీ చెత్త రహితంగా మార్చేయడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతుంది. ఆదివారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌లో స్వచ్చభారత్ మిషన్ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన భూగర్భ సొరంగంలో చెత్తను సేకరిస్తూ మోదీ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏఎన్ఐ ప్రకారం.. మోదీ కొత్తగా ప్రారంభమైన సొరంగాన్ని మోదీ పరిశీలిస్తు కనిపించారు. ఖాళీ వాటర్ బాటిల్, చెత్త పదార్ధాలను సేకరించడాన్ని చూడవచ్చు. ప్రగతి మైదాన్ పునరాభివృద్ధిలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌కు ప్రధాన టన్నల్, 5 అండర్‌పాస్‌లను మోదీ ప్రారంభించారు. ఈ సొరంగం 1.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
తూర్పు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ నుంచి ఇండియా గేట్, ఇతర సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాలకు సులభంగా ప్రయాణించవచ్చు. ఈ కారిడార్ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.920 కోట్లకుపైనే వ్యయంతో నిర్మించింది. కొత్త కారిడర్‌లో నిర్మించిన చెత్తను మోదీ తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Crime news: సలసలా మరుగుతున్న నీళ్లను.. మరిది మర్మాంగంపై పోసేసేసింది!