KomatiReddy : తెలంగాణ కాంగ్రెస్ లో కోమటి రెడ్డి బ్రదర్స్ చాలా సీనియర్ నాయకులని అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన హుజురాబాద్ బై పోల్స్‌కు కామారెడ్డి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను ప్రారంభిస్తానని భువనగిరి ఎంపీ కోమటి రెట్టి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎందుకో పాదయాత్ర చేపట్టలేకపోయారు.
ఒకవేళ నిజంగా ఆయన పర్యటన ప్రారంభిస్తే కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొనేది. అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ హుజురాబాద్ ఉపఎన్నికల్లో కేడర్ పనిచేస్తే విజయావకాశాలు కూడా మెండుగా ఉండేవి. కానీ, ఇలా చేయడం మాని కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తుతం వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తారు. ప్రజా నాడిని ఎలా పట్టుకోవాలో వీళ్లకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
కానీ ప్రస్తుతం ఈ బ్రదర్స్ నెమ్మదిగా తమ హవాను కోల్పోతున్నారని కాంగ్రెస్ శ్రేణులతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా కోడై కూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానంటూ పెద్ద బీరాలు పోయిన వెంకట్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ని విమర్శిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మొన్నటికి మొన్న జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం డిపాజిట్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు.
ఈ విషయంపై కూడా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే బదనాం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అసమర్ధత వల్లే హుజూరాబాద్ లో పార్టీ అంత ఘోరమైన ఓటమిని చవి చూసిందని ఆరోపిస్తున్నారు. అసలు హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి రేవంత్ రెడ్డికి సంబంధం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ వాళ్లకి బీఫారాలు ఇచ్చేది ఢిల్లీలో ఉండే అధిష్టానం కదా అని కోమటి రెడ్డిని అడుగుతున్నారు. ఇన్ని సార్లు గెలిచిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ను ఢీ కొట్టి పార్టీని నిలబెట్టాలని అంతే కానీ పదవిలో ఉన్న వారి మీద లేని పోని ఆరోపణలు చేస్తే మైలేజ్ రాదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి పలువురు నేతలు సూచిస్తున్నారు.
Read Also : Nara Lokesh : నారా లోకేష్ విషయంలో ఏం జరుగుతోంది? వారి వల్లనేనా ఇదంతా..?!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world