Congress New Strategy : రాజకీయాల్లో ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఎవరూ ఊహించనిదే జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు. రాజకీయ సమీకరణాలు కూడా ఒక్కసారిగా మారిపోతుంటాయి. ఇక ఆ లీడర్, పార్టీ పని అయిపోయిందిరా అనుకునేలోపే తిరిగి పుంజుకుంటారు. అధికారాన్ని తిరిగి దక్కించుకుంటారు. అందుకు కుల, వర్గ సమీకరణాలే కారణం కావొచ్చు. నిన్నటివరకు ఒక పార్టీకి విదేయుడిగా ఉన్న ఓ వ్యక్తి తెల్లారితే వేరే పార్టీలోకి కనిపిస్తాడు. ఇదే రాజకీయమని కొందరు దాని అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.
ఇకపోతే 2024 ఎన్నికల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వ్యూహాలను రచిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రతీ ఎన్నికల్లోనూ ఓడిపోతూ వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించాలని జాతీయ కాంగ్రెస్ భావించినట్టు తెలుస్తోంది.
2018 తర్వాత చిరు రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలంటే చిరును యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని ఇరు రాష్ట్రాల ముఖ్యనేతలకు రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి టీపీసీసీగా బాధ్యతలు చేపట్టాక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు. ఇక ఏపీలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ‘కాపు సామాజిక వర్గానికి’ చెందిన వారే తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అంటూ లీకులు ఇవ్వడంతో ఏపీలో చిరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించి మళ్లీ పుంజుకోవాలని కాంగ్రెస్ భావించినట్టు తెలుస్తోంది.
అదే నిజమైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అన్న చిరు పోటీగా మారుతారు. మెగా అభిమానుల్లో కూడా చీలిక ఏర్పడుతుంది. ఆ సమయంలో పవన్ బీజేపీతో దోస్తానా కట్ చేసుకుని కాంగ్రెస్‌తో జతకడితే ఇద్దరికీ మేలు జరుగుతుందని భావిస్తున్నారు. కానీ చిరు పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారా లేదా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న..
Read Also : CM KCR : హుజురాబాద్ ఎఫెక్ట్‌తో రంగంలోకి కేసీఆర్.. టార్గెట్ బీజేపీగా సరికొత్త వ్యూహం
Tufan9 Telugu News providing All Categories of Content from all over world