...

CM KCR on agnipath: సికింద్రాబాద్ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. 25 లక్షల ఆర్థిక సాయం!

CM KCR on agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఆయన మృతి పట్ల సీఎం సంతాపం వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రాకేష్ కుటుంబంలో అర్హులైన వారికి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల రాకేశ్ మృతి చెందాడని విచారం వ్యక్తం చేశారు.

అగ్నిపథ్ పథకం దేశ వ్యాప్తంగా అగ్గి రాజేస్తుందని.. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ సికింద్రాబాద్ లో యువకులు చేపట్టిన ఆందోళన రణరంగంలా మారింది. ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ క్రమంలోనే ఓ వ్యక్తి మృతి చెందగా… 13 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనలో మృతి చెందిన వ్యక్తి వరంగల్ జిల్లా వాసి దామెర రాకేశ్ గా గుర్తించారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ బోర్డుకి వెళ్లి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ కు వచ్చినట్లు పోలీసులు తెలిపాతరు.