Funds for telangana : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 4 వేల కోట్ల రూపాయల అప్పు పుట్టింది. అప్పు పుట్టడంతో త్వరలోనే రైతు బంధు నిధులను విడుదల చేయనున్నట్టు సమాచారం. బహిరంగ మార్కెట్ నుంచి ఈ అప్పు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక విధానంలో అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో 13 ఏళ్ల కాల పరిమితితో మంగళవారం బాండ్ల వేలానికి ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి అప్పులు, రుణ సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజులుగా అభ్యర్థించినా.. అటు నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. కానీ ఎట్టకేలకు అప్పుల సేకరణకు అనుమతి రావడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కొంత వరకు తగ్గనున్నాయి.
వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో 11 వేల కోట్ల రుణాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఎఫ్ఆర్బీఎం నూతన నిబంధనల పేరుతో కేంద్రం గత రెండు నెలలూ అనుమతిని ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ప్రభుత్వానికి రాబడి, ఖర్చులకు అంతరం పెరుగుతోంది. ఖజానాలో డబ్బు అంతగా లేకపోవడంతో సాధారణ రెవెన్యూ ఖర్చులు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు నిధుల సర్దుబాటు కష్టంగా మారింది. జూన్ నెలలో చెల్లించాల్సిన వేతనాలు, పెన్షన్లు, ఇతర పథకాలకూ ఇబ్బందులు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రుణ సేకరణకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రబుత్వానికి ఊరట లభించింది.
Read Also : Job Mela In Telangana : ఉద్యోగవకాశాలు.. తెలంగాణలో భారీ జాబ్ మేళా.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..!