Guppedantha Manasu june 4 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు ఆటోలో వెళ్తుండగా చున్నీ గాలిలో వేలాడుతూ ఉంటుంది. అప్పడు రిషి వెళ్ళి ఆటో డ్రైవర్ కి చెబుతాడు.
ఈరోజు ఎపిసోడ్ లో తన బుక్ గురించి పుష్పను అడగగా అప్పుడు పుష్ప రిషి సార్ నీ బుక్ తీసుకొని ఇక్కడ పెట్టమన్నాడు అని చెప్పడంతో వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు పుష్ప అందులో ఏముంది అని అడగగా వసు ఏమీ లేదు అని చెబుతుంది.

Guppedantha Manasu june 4 Today Episode
కానీ అందులో రిషికి సారి చెప్పినట్లు అందులో రాసి ఉంటుంది. ఇక రిషి వచ్చే బుక్ ఓపెన్ చేసి చూడగా అందులో వసు రాసినది చూసి అసలు వసు ప్రవర్తన ఏంటి అన్నది రిషి కి అర్థం కాదు. వెంటనే రిషి ఆ పేపర్ తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత పుష్ప నీ పిలిచి పిచ్చిరాతలు ఉన్న బుక్స్ ఇవ్వకూడదు అని అంటాడు.
ఇక అందరూ క్లాస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రిషి ఆ పేపర్ ను తీసుకొని డస్ట్ బిన్ లో పడేస్తాడు. అప్పుడు వసు కూడా చూడకుండా మౌనంగా వెళుతుంది. అప్పుడే జగతి ఆ పేపర్ చూడటంతో మళ్ళీ సారీ చెప్పడం ఎందుకో అని అనుకుంటుంది. మహేంద్ర వర్మ కూడా వచ్చి ఆ పేపర్ చూస్తాడు.
ఆ తర్వాత మహేంద్ర, జగతీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఎలా అయినా వారిని కలపాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక మరుసటి రోజు రిషి జరిగిన విషయాలను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ధరణి కాపీ తీసుకుని వచ్చి ఎందుకు అలా ఉంటున్నావు అని అడగగా సమాధానం చెప్పకుండా కాఫీ బాగుంది అని చెబుతాడు.
జగతి ఇంట్లో కూర్చొని బుక్స్ చదువుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన సాక్షి నేరుగా రిషి దగ్గరికి వెళ్ళాలి అని చూడగా ఇంతలో జగతి ఎక్కడికి అని అనటంతో రిషి దగ్గరికి అని చెబుతుంది సాక్షి. అప్పుడు జగతి, రిషి మనసు బాలేదు అని వెళ్ళకు అని చెబుతూ ఉండగా ఇంతలోనే అక్కిడికి దేవయాని వచ్చి వారు కాబోయే భార్య భర్తలు అని వెళితే తప్పేంటి అని అంటుంది.
ఇక జగతి కూడా వారికి సమాధానం చెబుతూ ఉండగా అప్పుడే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు రిషి ఏం జరిగింది అని అడగగా జగతి జరిగిన విషయానికి చెబుతుంది. అప్పుడు రిషి ఎవరు ముందు పెడితే వారి ముందు మన కుటుంబ వ్యవహారాలు మాట్లాడక పోవడం మంచిది అని సాక్షిని అవమానిస్తాడు.
మరొకవైపు వసు నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఇందులో సాక్షి అడ్డుపడి వసుతో కాస్త పొగరుగా మాట్లాడడంతో వసు స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో మహేంద్ర దంపతులు,రిషి కలిసి వసు పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడు రిషి వసు పై కోపంతో సాక్షి కారులో వెళ్తాడు. ఆ తర్వాత వసు ఆటోలో వెళ్తుండగా దారి మధ్యలో రిషి కి యాక్సిడెంట్ అయి ఉండటం చూసి ఎమోషనల్ అవుతుంది. వెంటనే రిషి నీ తీసుకొని హాస్పిటల్ కి వెళుతుంది.
Read Also : Guppedantha Manasu june 3 Today Episode : రిషి మాటలకు కుమిలిపోతున్న జగతి.. బాధలో వసు..?