...

BJP New Strategy : కమలనాథుల కొత్త వ్యూహం.. ఇక టీఆర్ఎస్ పని ఖతమేనా? 

BJP New Strategy : టీఆర్ఎస్ పార్టీకి కమలనాథులు భారీ షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసమ్మతి నేతలను గుర్తించి మారిని కమలం గూటికి తీసుకురావాలని ఆ పార్టీ నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను హుజూరాబాద్ లో గెలిచిన కమలం పార్టీ నేత ఈటల రాజేందర్ కు అప్పజెప్పనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఆ పార్టీలో ఉన్న మరో టీఆర్ఎస్ మాజీ నేత జితేందర్ రెడ్డి కూడా ఈ పనిలో పాలు పంచుకోవాలని కమలనాథులు చెప్పినట్లుగా పలువురు చర్చించుకుంటున్నారు.

ఈ పనిని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల లోపు చేయాలని బీజేపీ పార్టీ చూస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ పనిని హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనే చేయాలని భావించినా కానీ కాస్త ఆలస్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఎన్నికలు, మరియు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కమలనాథులు మంచి జోష్ లో కనిపించారు. కానీ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎన్నికలు, మరియు నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఊహించని ఫలితాలు రావడంతో ఆ పార్టీ శ్రేణులు ఢీలాపడ్డారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో కేసీఆర్ చేసిన పని కమలనాథులకు బాగా కలిసొచ్చింది.

ఈటలను బయటకు పంపడంతో ఈటలను కమలనాథులు పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా సరే అభ్యర్థులను నిలిపి టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్టీకి ఎమ్మెల్సీని గెలిపించే బలం లేకున్నా కానీ టీఆర్ఎస్ పార్టీకి భయం పుట్టించాలని కమలనాథులు భావిస్తున్నారట. క్రాస్ ఓటింగ్ భయాన్ని గులాబీ పార్టీకి బీజేపీ పార్టీ కల్పిస్తుందో లేదో వేచి చూడాలి.

Read Also : Ys Bharati Reddy : వచ్చే ఎన్నికల్లో భారతి కీలకం కాబోతున్నారా.. జగన్ ప్లాన్ ఇదే?