కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి. హనుమంతరావు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఇంటి ముందు ఉన్న కారును ధ్వంసం చేశారు. ఉదయం లేచి చూసే సరికి కారు ధ్వంసం అవడం గుర్తించిన ఆయన… పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
అయితే మాడీ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఎంపీగా పని చేసిన తనకు రక్షణ లేదా అని వీహెచ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి మాత్రం బాధ్యత లేదా అని అడిగారు. గతంలో బెదిరింపు కాల్స్ వస్తే.. డీజీపికి విన్నవించానన్నారు. అయినప్పటికీ వారు స్పందించలేదని.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానని వివరించారు. ఈ చర్యకు ఎరు పాల్పడ్డారో కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులదే అని చెప్పారు. అయితే త్వరగా వీరిని పట్టుకుంటే మంచిదని హితవు పలికారు. పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.