RK Roja: ఏడుపదుల వయసులో తోడు కావాలంటూ మంత్రికి రిక్వెస్ట్ చేస్తున్న వృద్ధుడు… ఆశ్చర్యపోయిన మంత్రి రోజా!

RK Roja: రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఈమె సినీ కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ తన విధులను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా గడపగడపకు వెళ్లి వైయస్సార్ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.

ఈక్రమంలోనే నగరి ఎమ్మెల్యే పర్యాటక శాఖ మంత్రి రోజా కూడా తన నగరి నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుత్తూరు మండలం శిరుగురాజుపాలెంలో గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాల గురించి ఆరా తీస్తున్న సమయంలో మంత్రికి ఒక వృద్ధుడి నుంచి వింత ఘటన ఎదురయింది.ఈ క్రమంలోనే ఏడు పదుల వయసు ఉన్న ఒక వృద్ధుడు మంత్రి గారితో మాట్లాడుతూ తనకు తోడు ఎవరు లేరని ఒంటరిగా ఉన్నానని, ఒంటరితనంతో ఉండలేకపోతున్నాను తనకు పెళ్లి చేయాలంటూ వృద్ధుడు వింత కోరికను బయటపెట్టారు.

Advertisement

ఈ విధంగా వృద్ధుడు పెళ్లి చేయమని రిక్వెస్ట్ చేయడంతో ఒక్కసారిగా మంత్రి రోజా ఆశ్చర్యపోయారు.పెన్షన్ రాకపోతే చెప్పు పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తా కానీ పెళ్లి చేయాలంటే కష్టమని ఆమె సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే తనకు పెన్షన్ వస్తుందని అయితే తాను ఒంటరిగా బతకలేక పోతున్నానని వృద్ధుడు సమాధానం చెప్పడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement