...

Banaras Movie Review : బనారస్ మూవీ రివ్యూ.. టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ.. అదిరిపోయిందిగా!

Banaras Movie Review : జయతీర్థ దర్శకత్వంలో రూపొందిన సినిమా బనారస్. ఈ సినిమా మిస్టరీ, రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందింది. ఇందులో జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజాశాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్న రాజ్, బర్కత్ అలీ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు తిలక్ రాజ్ బల్లాల్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు. బి అజనిష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందించాడు. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ: సినిమా కథ ఏంటంటే.. సోనాల్ మాంటెరో ధని పాత్రలో కనిపించింది. ఈమె చాలా మంచి అమ్మాయి. ఈమెకు సంగీతం పట్ల ఆసక్తి ఉండటంతో సింగింగ్ రియాలిటీ షోలో పార్టిసిపెంట్ చేస్తుంది. ఇక ఓ పోటీలో నెగ్గడం కోసం ఆమెకు సిద్ధార్థ్ ( జైద్ ఖాన్) దగ్గరవుతాడు. అయితే అతడు భవిష్యత్తులో మనిద్దరం భార్యాభర్తలం అంటూ.. ఫ్యూచర్ నుండి ప్రజెంట్ కు వచ్చానని చెప్పటంతో ధని నమ్ముతుంది. ఇక ధని అతనిని తన రూమ్ కి కూడా తీసుకెళ్తుంది.

banaras-movie-review-and-rating-details-inside
banaras-movie-review-and-rating-details-inside

ఇక సిద్ధార్థ ఆమె పడుకున్న సమయంలో తనతో సన్నిహితంగా ఫోటో దిగుతాడు. దాంతో తన స్నేహితుడు వల్ల ఆ ఫోటో సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది. దీంతో ధని క్యారెక్టర్ మీద బాగా ట్రోల్స్, నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి. దీంతో అవి తట్టుకోలేక హైదరాబాద్ నుండి బనారస్ కి తన బాబాయ్ ఇంటికి వెళుతుంది. ఇక తప్పు జరిగిందని తెలుసుకొని ధనికి సారీ చెప్పడానికి సిద్ధార్థ్ బయలుదేరుతాడు. దీంతో అక్కడికి వెళ్లాక అందరికి ఏమి ఎదురవుతుంది.. అతడు భవిష్యత్తు నుండి వర్తమానంకు రావడం కారణం ఏంటి అనేది మిగిలిన కథలోనిది.

Banaras Movie Review : టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ.. సినిమా ఎలా ఉందంటే? 

నటినటుల నటన: జైద్ ఖాన్ తొలిసారిగా హీరోగా నటించిన కూడా తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఎమోషన్స్ కూడా అద్భుతంగా చూపించాడు. హీరోయిన్ సోనాల్ కూడా అద్భుతంగా నటించింది. మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్: టెక్నికల్ పరంగా దర్శకుడు మంచి కథని ఎంచుకున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది. మిగతా టెక్నికల్ విభాగాలు కూడా తమ పనులలో పూర్తి న్యాయం చేశాయి.

విశ్లేషణ: ఈ సినిమా మంచి ప్రేమ కథతో మొదలవుతుంది. మధ్యలో కొన్ని మలుపులు ఆశ్చర్యానికి గురి చేయడం బాగా త్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమాని బోర్ కొట్టకుండా చూపించాడు డైరెక్టర్. నిజానికి ఈ సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్: టైం ట్రావెల్, నటీనటుల నటన, షాకింగ్ ట్విస్ట్.

మైనస్ పాయింట్స్: కొన్ని సీన్స్ రిపీట్ చేసినట్లుగా అనిపించాయి.

బాటమ్ లైన్: చివరిగా చెప్పాల్సిందేంటంటే.. ఈ సినిమాను ఒక్క టికెట్ పై రెండు సినిమాలు గా చూసినట్లు అనిపిస్తుంది. ఇక మంచి లవ్ స్టోరీ తో పాటు టైం ట్రావెల్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చి ప్రేక్షకులను మరింత సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పవచ్చు.

రేటింగ్: 3.0/5

Read Also : Jetty Movie Review : ప్రతి ప్రేక్షకుడి గుండె తాకే కథ!