Devotional : చనిపోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చావు అనేది అనివార్యంగా జరిగేది. అయితే కుటుంబసభ్యులను కోల్పోవడం సాధారణ విషయమేమీ కాదు. వారితో ఉండే అనుబంధం దూరం అవుతుంది. అయితే ఇంట్లో ఎవరైనా చనిపోతే కొన్ని నియమాలు పాటించడం హిందూ సాంప్రదాయంలో ఉంది. కుటుంబసభ్యులు చనిపోతే ఆ ఏడాది అంతా ఇంట్లో ఎలాంటి పూజలు చేసుకోకూడదు. అలాగే ఎలాంటి ఆలయాలకు, తీర్థయాత్రలకు వెళ్లకూడదు.
కొందరు సంప్రదాయంలో అయితే ఇంట్లోని దేవుడి పటాలను ఒక మూట కట్టి పక్కన పెట్టేస్తారు. ఏడాది కర్మ చేసిన తర్వాతే దేవుడి ఫోటోలను తీసి గంగాజలంతో కడిగి పూజలు పునస్కారాలు ప్రారంభిస్తారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే పని.
కానీ ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదని పండితులు చెబుతున్నారు. దీపంలోని ఇల్లు స్మశానంతో సమానమని వారు అంటున్నారు. చని పోయిన తర్వాత 12వ రోజు నుండి ఇంట్లో దీపం వెలిగించుకోవాలని వారు సూచిస్తున్నారు. కానీ, పండగలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శుభకార్యాలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదని వాళ్లు అంటున్నారు. ఇక ఆలయాలకు వెళ్లకూడదన్న నియమం ఎక్కడా లేదని వారు చెబుతున్నారు. అలాగే గర్భగుడిలోకి వెల్లి దేవుడిని తాకకూడదని మాత్రం చెబుతున్నారు.
Read Also : Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు ఈరోజు అస్సలే బాలేదు, జాగ్రత్త సుమీ!