Ashada masam : ఆషాఢ మాసం రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. అయితే కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లబోయేది ఈరోజే. అందుకు చాలా మంది అమ్మాయిలకు ఆషాఢ మాసం అంటే ఇష్టం. గోరింటాకు, బోనాల పండుగ, కొత్తగా పెళ్లైన అమ్మాయిలు పుట్టింటికి చేరుకోవడం ఇలా ఎన్నో తంతులు ఆషాఢ మాసంలో ఉంటాయి. మన దేశంలో ఈ మాసానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో కొతత్ కోడలు, అత్త మొహం చూడకూడదని చెబుతుంటారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ నియమాన్ని పాటిస్తున్నారు. అయిదే ఇలా ఎందుకు పంపిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తగా పెళ్లైన ఆడపిల్లలను ఆషాఢ మాసంలో పుట్టింటికి పంపడానికి వెనుక ఓ పెద్ద కథనే ఉంది. అందేంటంటే ఈ సమయంలో వర్షఆలు పడటం.. మనుషులు చాలా అనారోగ్యాల పావడం జరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో భార్యాభర్తల కలయిక వల్ల.. అమ్మాయి గర్భం దాలిస్తే.. బిడ్డ ఆరోగ్యంగా ఉండదని వారి నమ్మకం. అంతే కాకుండా ఇప్పుడు అమ్మాయి గర్భం దాలిస్తే… పుట్టబోయే సమయానికి విపరీతమైన ఎండలు కాస్తాయని.. ఆ వేడిని చిన్న పిల్లలు తట్టుకోలేరని అమ్మాయిని ఇలా పుట్టింటికి పంపిస్తుంటారు.
Read Also : Ashadh Amavasa 2022: ఆషాడ అమావాస్య ఎప్పుడు వస్తుంది.. ఆ రోజు ఈ చిన్న పని చేస్తే చాలు ధన ప్రవాహమే!