Viral video: రోడ్లపై వెళ్లేటప్పుడు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ఏమర పాటు కూడా ప్రాణాల మీదకు తెస్తుంది. అలాగే ఎదుటి వారు చేసే చిన్న తప్పిదం మన ప్రాణాలను తీస్తుంది. అలాంటిదే ఒక వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. తర్వాత ఏం జరిగిందంటే..
మామూలుగా మనం కరెక్టుగా ఉండి, అన్ని రూల్స్ పాటిస్తూ ఉన్నప్పుడు.. వేరే వ్యక్తి తన వాహనంతో వచ్చి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మనల్ని ఢీకొడితే మనకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ వ్యక్తిపై అరవడంతో పాటు ప్రమాద తీవ్రతను బట్టి కొట్టేందుకు కూడా సిద్ధపడతారు చాలా మంది. కానీ ఈ వీడియోలో బైకర్ రియాక్షన్ చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఓ వ్యక్తి తన బైక్ పై వెళ్తుండగా.. సిగ్నల్ వద్ద ఓ కారు వచ్చి అతడిని ఢీకొట్టింది. దీంతో అతడు రోడ్డుపై పడిపోయాడు. తర్వాత పైకి లేచి వేగంగా… తనను ఢీకొట్టిన కారు వద్దకు వస్తాడు. అప్పుడే ఆ కారును నడుపుతున్న మహిళ కిందకు దిగుతుంది. ఆమె దగ్గరకు వెళ్లిన బైకర్.. తనను ఏమీ అనకుండా ఓ హగ్ ఇచ్చి కాసేపు మాట్లాడతాడు. ఇది చూసిన పక్కన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బైకర్ సహనానికి అక్కడ ఉన్న నోరెళ్లబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement