Interesting news: అతి పే..ద్ద పెన్.. ఈ బాహుబలి పెన్నును చూస్తే షాకే..!!

Interesting news: పెన్ను అంటే చేతిలో ఇమిడి పోతుంది. ఒక చేతితో పట్టుకుని కాగితంపై అలా అలా ఇట్టే రాసేయొచ్చు. కానీ ఈ పెన్నును చూస్తే షాక్ కావాల్సిందే. ఎందుకంటే ఈ పెన్నును ఒక చేత పట్టుకుని రాయడం కుదరదు. రెండు చేతులతో పట్టుకున్నా.. రాయడం సులువు కాదు. కనీసం ముగ్గురు లేదా నలుగురైనా ఉండాల్సిందే. ఎందుకంటే ఇది బాహుబలి పెన్ను మరి.

Advertisement

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆచార్య మకునూరి శ్రీనివాస అతి పెద్ద పెన్నును రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించాడు. గిన్నీస్ బుక్ ప్రతినిధులు ఆచార్య రూపొందించిన బాహుబలి పెన్నును పరిశీలించి రికార్డుకు సంబంధించిన పత్రాలు అందించారు. ఈ పెన్నును తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ మరో ఇద్దరు పట్టుకుని ఈ పెన్నుతో రాశారు.

ఈ భారీ పెన్నును హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రదర్శన చేశారు. ఇత్తడితో ఈ పెన్నును తయారు చేశారు. ఈ బాహుబలి పెన్ను 5.5 మీటర్ల పొడవు ఉంది. 37.2 కిలోల బరువు ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద పెన్నుగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది ఈ పెన్ను. దీనికి ముందు హైదరాబాద్ లో తయారు చేసిన 1.45 మీటర్ల పొడవైన పెన్ను అతి పెద్దదిగా రికార్డుల్లో ఉండేది.

Advertisement

ఇంత పెద్ద పెన్ను కేవలం ప్రదర్శన కోసమే అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఈ సాధారణ పెన్నులాగే రాస్తుంది కూడా. కానీ ఈ బాహుబలి పెన్నుతో రాయాలంటే కనీసం నలుగురు వ్యక్తులు ఉండాలి. పేద్ద కాగితం కావాలి. నలుగురు వ్యక్తులు ఈ పెన్నును పట్టుకుని సాధారణ పెన్నులా రాసేయొచ్చు.

Advertisement