...

Interesting news: కుడి కన్ను కొట్టుకోవడం అశుభానికి సంకేతమా..? అది ఎంత వరకు నిజం!

Interesting news: శాస్త్రాలన్నీ మానవ జీవితంతో ముడిపడినవే. ఆయా శాస్త్రాలను కొందరు నమ్మవచ్చు. కొందరు వాటిని కొట్టి పారేయవచ్చు. కానీ శాస్త్రాల్లో చెప్పారంటే.. అందులో ఎంతో కొంత వాస్తవం ఉండకపోదు. ఎంతో పరిశోధన, అధ్యయనం చేసిన తర్వాతే ఒక పుస్తకం బయటకు వస్తుంది. అలాంటిది ఓ శాస్త్రమే పుట్టిందంటే దానికి ఇంకెంత అధ్యయనం అవసరం అవతుందో తెలుసుకోవాలి. అందుకే ఒక శాస్త్రాన్ని ఎప్పుడూ గుడ్డిగా కొట్టి పారేయకూడదు.

సముద్ర పురాణాల్లో శరీర భాష గురించి ప్రత్యేకంగా చెప్పారు. దాని ప్రకారం శరీరంలోని అవయవాలు స్పందించిన తీరును బట్టి మనకు మంచి జరుగుతుందో.. చెడు జరుగుతుందో ఇట్టే చెప్పవచ్చు. కళ్లు కొట్టుకోవడం అనేది పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఉంటుందని సముద్ర పురాణం చెబుతోంది. పురుషులకు కుడి కన్ను కొట్టుకోవడం శుభప్రదంగా పరిగణిస్తారు.

స్త్రీలకు ఎడమ కన్ను కొట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రంలో ఉన్న సముద్ర గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి కుడి కన్ను కొట్టుకున్నట్లైతే అది అతనికి మంచి సంకేతాలను తెస్తుంది. కుడి కన్ను అదే పనిగా కొట్టుకుంటే, వ్యక్తి అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అదనంగా వ్యక్తికి పదోన్నతి లేదా సంపదను పొందే అవకాశం ఉంటుంది.

మహిళలకు ఇది పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే స్త్రీల్లో కుడి కన్ను కొట్టుకుంటుందే అది ఏమాత్రం మంచిది కాదు. స్త్రీకి కుడి కన్ను కదిలితే, అది ఆమెకు అరిష్ట సంకేతం, ఇలా కన్ను కొట్టుకోవడం వల్ల స్త్రీకి చెడ్డ సంకేతం అని నమ్ముతారు.