Guppedantha Manasu April 23 Today Episode: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి, మహేంద్ర లను చూసి దేవయాని కుళ్ళు కుంటూ ఉంటుంది.
ఈ రోజు ఎపిసోడ్ లో దేవయాని, జగతి, మహేంద్ర రాత్రి సమయంలో కాలేజీ పనుల్లో తిరిగి తిరిగి అలసి పోయారు. ధరణి వెళ్లి వారికి మర్యాదలు చేయి అని అంటుంది. అప్పుడు జగతి మాకేం మర్యాదలు అవసరంలేదు ధరణి అత్తయ్య గారిని బాగా చూసుకో చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఆతర్వాత దేవయాని వసు బావా రాజీవ్ కు ఫోన్ చేసి వసుధార కనిపించకూడదు నువ్వు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు అని చెబుతుంది. అప్పుడు రాజు నా అకౌంట్ డీటెయిల్స్ పెడతాను అడ్వాన్స్ కొట్టండి పని మొదలు పెడతాను అని అంటాడు. మరొకవైపు వసు లేట్ గా నిద్ర లేచి టైం అయిపోయింది అని కంగారు పడుతూ ఉంటుంది.
మరోవైపు రిషి కూడా వసు ని ట్యూషన్ కీ తీసుకొని రావడానికి బయలుదేరుతాడు. ఇక వసు రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా ఇందులో వసు రావడంతో ఇద్దరూ కలిసి రిషి ఇంటికి వెళ్తారు. ఇక వాళ్ళిద్దర్నీ రాజీవ్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇక దేవయానికి ఫోన్ చేసి త్వరలోనే పని పూర్తి చేస్తాను అని చెబుతారు.
ఇక మరొకవైపు రిషి, వసు ని జగతికి అప్పగించి ఎలా అయినా స్కాలర్షిప్ కాంపిటీషన్లో మొదటి స్థానంలో ఉండాలి అని జగతితో చెబుతాడు. ఆ తరువాత వసుధార కు కావలసిన అన్ని ఏర్పాట్లు చూడమని ధరణికి చెబుతాడు. అప్పుడు దేవయాని రిషి ఏం చేస్తున్నాడో అర్ధం కాక అలాగే చూస్తూ ఉండి పోతుంది.
అప్పుడు రిషి మాట్లాడుతూ పెద్దమ్మ కొద్దిరోజులు వసు ఇక్కడికి ట్యూషన్ కి వస్తుంది తనని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవయానికి చెబుతాడు. ఆ తర్వాత కాలేజీలో స్టూడెంట్స్ అందరూ వసు, రిషి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న వసు బాధతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also :Guppedantha Manasu: వసుపై కోపంతో రగిలి పోతున్న దేవయాని.. రిషి ఏం చేయనున్నాడు..?