Guppedantha Manasu Dec 30 Today Episode : రాజీవ్ మాటలకు కోపంతో రగిలిపోతున్న రిషి.. జగతి మీద విరుచుకుపడిన చక్రపాణి?

Updated on: December 30, 2022

Guppedantha Manasu Dec 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి తన ఫ్యామిలీ అందరిని బయలుదేరమని చెబుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో మేడం మీరు కూడా రావాలి అని ఎంతో సరే రిషి అంటుంది జగతి.

ఆ తర్వాత వదిన పెద్దమ్మ అందరూ వింటున్నారా అందరూ తప్పకుండా రావాలి పెదనాన్న అందరిని దగ్గర ఉండి తీసుకురండి అనడంతో సరే అంటాడు పనింద్ర. ఇప్పుడు జగతి దంపతులు సంతోష పడుతూ ఉండగా అది చూసి దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు రిషి ఫోన్లో వసు ఫోటోలు చూస్తూ సంతోష పడుతూ ఉంటాడు. వసుధార నిజంగానే నీ రాక నా జీవితం అద్భుతం.

Guppedantha Manasu Dec 30 Today Episode
Guppedantha Manasu Dec 30 Today Episode

కాదు నువ్వే ఒక అద్భుతం అంటూ ఫోన్లో వసుధార ఫోటో చూసి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే రాజీవ్ అక్కడికి రావడంతో అది చూసి రిషి కోపంతో రగిలిపోతాడు. నువ్వేంటి ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చావు అనడంతో అదేంటి రిషి సార్ మీరే ఇక్కడికి వచ్చి నన్ను మళ్ళీ ప్రశ్నిస్తున్నారు అని అంటాడు రాజీవ్. అప్పుడు రాజీవ్ వెటకారంగా మాట్లాడడంతో మర్యాదగా బయటికి వెళ్తావా లేదా అని రిషి సీరియస్ గా మాట్లాడుతాడు. అదేంటి రిషి సార్ నేనేదో శుభవార్త చెబుదామని వస్తే మీరు అంతగా సీరియస్ అవుతున్నారు అనడంతో శుభవార్త లేదు ఏం లేదు బయటికి వెళ్తావా లేదా అంటాడు రిషి.

Advertisement

మీ ప్రియమైన స్టూడెంట్ వసుధార పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆ పెళ్లిలో పెళ్ళికొడుకు ఎవరో తెలుసా నేనే అనడంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను అని అంటాడు రిషి. నువ్వు ఫస్ట్ ఇకనుంచి వెళ్ళు లేదంటే కొట్టినా కొడతాను అనగా కొడితే కొట్టండి ముఖంపై కొట్టొద్దండి ఎందుకంటే పెళ్లి ఫోటోలు సరిగ్గా రావాలి కదా అని అనడంతో కోపంతో రాజీవ్ మెడబట్టి బయటకు గెంటేస్తాడు రిషి. అప్పుడు ఫోన్లో వసుధార ఫోటో చూస్తూ చూసావా వసు వాడు ఎలా మాట్లాడుతున్నాడో అంటూ వసుధార ని చూసి మాట్లాడుకుంటూ ఉంటాడు.

మరొకవైపు చక్రపాణి వసుధార అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు సుమిత్ర ఎదురుగా ఉండడంతో ఏమీ తెలియనట్టుగా కూల్ గా మాట్లాడుతూ నా కూతురు పెళ్లి విషయంలో నాకు అధికారం ఉండదా సుమిత్ర అని అడగడంతో ఏంటండీ అంత కూల్ గా మాట్లాడుతున్నారు అని అంటుంది. మరొకవైపు వసుధార జగతి ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగా అందులో మంగళసూత్రం ఉండటంతో అది చూసి వసుధార సంతోషపడుతుంది. అప్పుడు అదే మంచి సమయం అనుకున్నా సుమిత్ర ఇందాక అమ్మాయి అబ్బాయి ఫోటో చూపించింది.

Guppedantha Manasu Dec 30 Today Episode : నాన్న మర్యాదగా ఫోన్ ఇవ్వండి అంటూ వసుధార ఫైర్..

చాలా బాగా ఉన్నాడండి అనడంతో వెంటనే సుమిత్ర అని గట్టిగా అరుస్తాడు చక్రపాణి. కూల్ గా మాట్లాడుతున్నాను కదా అని నీకు కూడా చులకన అయిపోయానా అని అంటాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో దాని పెళ్లికి ఒప్పుకోను అసలు నిన్ను కాదు దాన్ని అనాలి అని వసుధార దగ్గరికి కోపంగా వెళుతుంటాడు. చక్రపాణి అక్కడికి వస్తుండడంతో వసుధార ఆ మంగళసూత్రాన్ని దాచేస్తుంది. ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి మీ అమ్మను పెళ్లికి ఒప్పించమని రాయబారం పంపించావా అని అడగడంతో అదేం లేదు నాన్న అనగా నీ పెళ్లికి మాత్రం నేను ఎట్టి పరిస్థితులలోను ఒప్పుకోను అని అంటాడు చక్రపాణి.

Advertisement

అప్పుడు వసుధర మీద కోపంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే జగతి ఫోన్ చేయడంతో ఈ దరిద్రం నిన్నింకా వదలలేదా అంటూ వసుధార చేతిలో నుంచి ఫోన్ లాక్కొని నమస్తే టీచర్ అమ్మ అని మాట్లాడతాడు. నాన్న మర్యాదగా ఫోన్ ఇవ్వండి అనడంతో మాట్లాడకు అని సీరియస్ అవుతాడు.. చక్రపాణి గారు అనడంతో ఆ ఇంట్లో నుంచి బిడ్డ వెళ్లిపోయిన ఏమి చేయలేని ఆ చక్రపాణిని మాట్లాడుతున్నాను. చేతగాని ఒక చక్రపాణితో మీరు మాట్లాడుతున్నాడు అంటూ జగతి మీద విరుచుకుపడుతూ ఉంటాడు చక్రపాణి.

అప్పుడు ఇది ఎవర్నో పిలుచుకోవచ్చు పెళ్లి చేసుకుంటానంటుంది ఈ విషయంలో కూడా మీరు ఇంకా సలహాలు ఇస్తూనే ఉన్నారా అంటూ రిషి గురించి నోటికొచ్చిన విధంగా మాట్లాడడంతో రిషి ఎవరో కాదు నా కొడుకు ఆనందంతో మొదట షాక్ అయిన చక్రపాణి ఆ తర్వాత పిచ్చి పట్టిన వాళ్ళ నవ్వుతూ అనుకున్నాను నీ కొడుకు కోసం నా కూతురిని బాగానే సెట్ చేసుకున్నావు.

నీ కొడుకుని ఇచ్చి నా కూతురు గొంతు కోయాలని చూస్తున్నావా అంటూ దారుణంగా మాట్లాడుతాడు. నీ భర్త ఎవరో తెల్దు వాడు ఎవడికి పుట్టాడో తెలియదు నీ ఊరు తెలియదు ఇప్పుడు వాడు నీ కొడుకు అంటే నమ్మేయాలా అనడంతో మర్యాదగా మాట్లాడండి చక్రపాణి గారు అని అంటుంది జగతి . ఈ పెళ్లికి నేను అసలు ఒప్పుకోను అని అంటాడు చక్రపాణి.

Advertisement

Read Also : Guppedantha Manasu Dec 29 Today Episode : వసుకి ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చిన రిషి.. వసుధార మాటలకు షాకైన చక్రపాణి?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel