...

Big Boss: ఈవారం డేంజర్ లో ఉన్న కంటెస్టెంట్ లు వాళ్లే.. ఈవారం డబల్ ఎలిమినేషన్ పక్కా?

Big Boss: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం 24 గంటల పాటు ప్రసారమవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఇప్పటికీ ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ కూడా ప్రసారమవుతుంది. ఇక తొమ్మిదవ వారంలో అఖిల్, ఆశు రెడ్డి, బిందుమాధవి మినహా మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావిస్తున్నారు.

గత వారం బాబా భాస్కర్ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో మిత్రశర్మ, అనిల్ బాబా భాస్కర్ మాస్టర్ ఓటింగ్ శాతంలోముందంజలో ఉన్నారు. ఇక పిల్లల టాస్క్ లో భాగంగా నటరాజ మాస్టర్, ఈ వారం ఓటింగ్ లో ముందుకు వెళ్లారు. హమీదా కూడా ఎక్కువగా దక్కించుకొని సేఫ్ జోన్లో ఉన్నారు.

ఇక ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ లలో ఆరియనా, అనిల్ ఉన్నారు.వీరిద్దరికీ ఓట్లు తక్కువగా రావడంతో ప్రస్తుతం వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారని ఈ వారం వీరిద్దరే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మరి సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వీరిద్దరూ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కానున్నారా లేక వీరిద్దరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారనే విషయం తెలియాల్సి ఉంది