Shani jayanthi 2022 : మన హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యని శని జయంతిగా జరుపుకుంటారు. అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య రోజునే శని దేవుడు జన్మించాడని… అందుకే ఆ రోజుని శని జయంతిగా జరుపుకుంటామని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈరోజును శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే పలు రకాల పూజలతో పాటు, కొన్ని వస్తువులను దానం చేయాలని వేద పండితులు సూచిస్తున్నారు. దాని వల్ల మనకు చాలా లాభాలు కల్గుతాయని కూడా వివరిస్తున్నారు. అయితే శని జయంతి రోజు ఎలాంటి వస్తువులు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.c

ముందుగా నల్ల నువ్వులు.. శని దేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయడం చాలా మంచిదని భక్తుల నమ్మకం. అయితే శని జయంతి నాడు ఉదయమే నిద్ర లేచి తల స్నానం చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ తర్వాత శనీశ్వరుడికి నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించి… అనంతరం వాటిని భక్తులకు పంచి పెట్టాలి. అలాగే బెల్లం దానం చేయడం వల్ల అనేకమైన అద్భుత ఫలితాలు ఉంటాయట. నల్లని బట్టలు కూడా దానం చేయవచ్చును. అయితే మీరు ఏది దానం చేయాలనుకున్న ముందుగా ఆ శనీశ్వరుడికి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాతే వాటిని దానం చేయాలి.
Read Also : Shani Jayanthi : శని దోషం తొలగిపోవాలంటే శని జయంతి రోజున ఈ పరిహారం చేస్తే చాలు..?