Jr NTR : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. చూసినవా థియేటర్ వద్ద మేకర్స్ కు కాసుల వర్షం కురిపించింది.ఈ సినిమా విజయంతో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ తన తర్వాత సినిమా కొరటాల శివతో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.
కానీ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొరటాల శివకు ఒక కండిషన్ పెట్టినట్లు సినీ వర్గాల సమాచారం. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం నాలుగు సంవత్సరాలు సమయం కేటాయించిన ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను మాత్రం అతి తక్కువ సమయంలోనే పూర్తిచేయాలని అది కూడా 70 రోజులలో సినిమాను పూర్తి చేయాలని కొరటాల శివకు కండీషన్ పెట్టారట.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో కొరటాల ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు.సాధారణంగా సినిమా పూర్తి చేయడానికి తక్కువ సమయం తీసుకునే కొరటాల కానీ ఇండియా లెవెల్ లో సినిమా చేయడానికి 70 రోజుల సమయం సరిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ పెట్టిన కండిషన్ కు కొరటాల ఓకే చెప్పాడా లేదా అన్న సంగతి గురించి తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తన 30 వ సినిమాలో కథానాయక ఎవరు అన్నది ఇంకా ఇప్పటివరకు ఫిక్స్ అవ్వలేదు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది.
Read Also : Card less cash: కార్డులేకున్నా డబ్బు విత్ డ్రా.. అన్ని ATMలలో త్వరలో సదుపాయం