Card less cash: కార్డులేకున్నా డబ్బు విత్ డ్రా.. అన్ని ATMలలో త్వరలో సదుపాయం

ఏటీఎంల నుండి నగదు ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. డెబిట్ కార్డు అవసరం లేకున్నా నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలలో అందుబాటులోకకి రానుంది. ఏటీఎం కేంద్రాల్లో ఈ సౌలభ్యాన్ని కల్పించేందుకు అన్ని బ్యాంకులకు ఆర్ బీఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్డు లేకున్నా నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. కానీ అది కొన్ని బ్యాంకులకే పరిమితం.

యూపీఐ వ్యవస్థను ఉపయోగిస్తున్న అన్ని బ్యాంకులు, ఏటీఎంలలో కార్డ్ లెస్ విత్ డ్రా సదుపాయం కల్పించనున్నట్లు ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీని వల్ల కార్డు స్కిమ్మింగ్, కార్డు క్లోనింగ్ వంటి మోసాలకూ చెకు పడుతుందని అన్నారు. పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించే సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుత ఎస్బీఐ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా మరికొన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తమ బ్యాంక్ యాప్స్ ద్వారా అందిస్తున్నాయి. క్యాష్ లెస్ విత్ డ్రా చేయాలంటే ముందు మనం ఎంత విత్ డ్రా చేయాలో యాప్ లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్ వస్తుంది. ఆ పిన్ నంబరుతో ఏటీఎంలో నగదు డ్రా చేసుకోవచ్చు.