Kamal Haasan : కమల్ హాసన్‌కి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. లోకనాయకుడికి ఏమైందంటే?!

Tamil Actor kamal haasan hospitalized in chennai
Tamil Actor kamal haasan hospitalized in chennai

Kamal Haasan : తమిళ విలక్షణ నటుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురయ్యాడు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కమల్ హాసన్ చేరారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిట‌ల్‌లో కమల్ అడ్మిట్ అయినట్టు తెలిసింది. గతకొద్దిరోజులుగా తీవ్ర‌మైన జ్వ‌రంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవ‌టంలో ఇబ్బంది ఎదురైంది.

దాంతో క‌మ‌ల్ హాస‌న్ ను హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు కమల్‌కు పోస్ట్ కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉండి ఉంటాయని అంటున్నారు. ఆయ‌న‌కు శ్వాసపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఇటీవలే సినీ ప్రముఖులతో కలిసి కమల్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

Advertisement
Tamil Actor kamal haasan hospitalized in chennai
Tamil Actor kamal haasan hospitalized in chennai

హైదరాబాద్‌లో కమల్ హాసన్ ఆయ‌న క‌ళా త‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్‌ని క‌లిశారు. వారిద్దరూ దిగిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. కమల్ హాసన్ ఆస్పత్రిలో చేరారనే తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ లోక నాయకుడికి ఏమైందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా కమల్ తన సత్తా చాటారు. దర్శకుడిగానూ ప్రయోగాత్మక మూవీలు చేసి సక్సస్ సాధించారు.

ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ (Bigg Boss Tamil) షోకు తమిళంలో హోస్ట్ వ్యవహరిస్తున్నారు. శంకర్‌తో కలిసి ఇండియన్ 2 మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. గత ఏడాది విక్రమ్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతకముందు కమల్ కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మిగతా షూటింగ్ పూర్తి చేశారు. ఇండియన్ 2ను పూర్తి చేసేందుకు కమల్ ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Read Also : Anitha Chowdary : వద్దన్నా వదల్లేదు.. హీరో శ్రీకాంత్ పెళ్లి చేసుకోమని టార్చర్ చేశాడన్న అనిత చౌదరి..!!

Advertisement