...

Karthika Deepam: హిమపై సీరియస్ అయిన స్వప్న.. ఆనందంలో జ్వాలా..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరూపమ్ నీతో ఒక విషయం చెప్పాలి త్వరగా రా అని జ్వాలాతో అనడంతో ద్వారా సంతోషంగా బయలుదేరగా అప్పుడే ఆటోలో డీజల్ అయిపోతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో ఆటోలో డీజిల్ అయిపోవడంతో అటుగా వెళ్తున్న అందరిని లిఫ్ట్ అడుగుతుంది జ్వాలా. కానీ ఏ ఒక్కరూ లిఫ్ట్ ఇవ్వకపోవడంతో నెక్స్ట్ వచ్చే కారుకి అడ్డంగా నిలబడాలి అని అనుకుంటూ రోడ్డుకి అడ్డంగా నిలబడడంతో ఇంతలో సౌందర్య వస్తుంది. ఆ తర్వాత సౌందర్య ని వినయంగా హెల్ప్ అడిగింది కారులో డీజల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది జ్వాలా.

అప్పుడు నానమ్మ నిన్ను ఫాలో చేయాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. ఇక మరొక వైపు డాక్టర్ సాబ్ నా కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని అనుకొని అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోయి హోటల్లో ఎదురుచూస్తూ ఉంటుంది.

మరొకవైపు స్వప్న ఇంట్లో తలనొప్పి నీరసంగా ఉంది అని కింద పడి పోతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన సౌందర్య స్వప్నను పట్టుకోగా స్వప్న మాత్రం చిరాకు పడుతుంది. అప్పుడు సౌందర్య స్వప్నపై అరిచి బెడ్ పైన పడుకోబెట్టి తనకు సపర్యలు చేస్తుంది. మరొకవైపు రెస్టారెంట్ కి వెళ్ళిన జ్వాలా, నిరూపమ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

తనకు ఎదురుగా ఉన్న కుర్చీ లో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూర్చోవడానికి రాగా వారితో ఫన్నీగా గొడవ పెట్టుకుంటుంది. మరొకవైపు సౌందర్య,స్వప్న ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి అక్కడికి హిమ ను రప్పిస్తుంది. హిమ ని చూసిన స్వప్న మా ఇంట్లో డాక్టర్ లేడా అంటూ హిమ పై సీరియస్ అవుతుంది.

మరొకవైపు జ్వాలా దగ్గరికి నిరూమ్ వస్తాడు. అక్కడ నిరూపమ్ మాట్లాడుతూ జ్వాలా నీకు ఒక విషయం చెప్పాలి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అనగా, జ్వాలా తన మనసులో ఐ లవ్ యూ అని చెప్పబోతున్నాడు అని అనుకుంటుంది.

నిరూపమ్ చెప్పబోతుండగా అంతలో జ్వాలా నేనే మీకు ముందుగా ఒకటి చెప్పాలి అనుకున్నాను అని అనడంతో జ్వాలా తన మనసులో మాట చెప్పబోతుండగా ఇంతలో అక్కడికి ఎవరో వస్తారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.