Karthika Deepam: తల్లితండ్రులను చూసి ఎమోషనల్ అయిన కార్తీక్!

Updated on: January 19, 2022

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప ఇంట్లో గ్యాస్ అయిపోతుంది. ఇక దీప హోటల్లో అప్పారావుని గ్యాస్ సిలిండర్ అడిగితే ఇస్తాడేమో అని కార్తీక్ పనిచేసే హోటల్ కి వెళుతుంది.

మరోవైపు ఆ హోటల్ లో అప్పు కార్తీక్ కు రుద్రాణికి ఒక పార్సల్, ప్రకృతి వైద్యశాల ఒక పార్సల్ అని చెప్పి డెలివరీ చేసి రమ్మంటాడు. దానికి కార్తీక్ మనసులో ఆలోచిస్తాడు. ఆ తర్వాత డెలివరీ చేయడానికి సైకిల్ మీద వెళ్ళిపోతాడు. అటుగా వస్తున్న దీప కార్తీక్ ను చూసుకోకుండా హోటల్ కి వెళుతుంది. ఇక హోటల్ కి వెళ్ళిన దీప అప్పారావుని గ్యాస్ సిలిండర్ ఇస్తావా అని అడుగుతుంది.

కానీ అప్పారావు అంతక ముందే తన భర్త అయిన కార్తీక్ కు గ్యాస్ సిలిండర్ ఇస్తానని మాట ఇస్తాడు. కాబట్టి దీపకు సారీ చెబుతాడు. మరోవైపు విన్ని, మోనితను ‘నేను ఎన్నో లవ్ స్టోరీస్ చదివాను. ఎన్నో సినిమాలు చూసాను కానీ మీ లవ్ స్టోరీ మాత్రం మామూలుగా లేదు మేడం’ అంటూ మోనితను ను పొగడ్తలతో తెగ ముంచేస్తుంది.

Advertisement

పార్సల్ ఇవ్వడానికి ప్రకృతి వైద్యశాలకు వెళ్లిన కార్తీక్ స్వయంగా వాళ్ళ అమ్మ నాన్న కే ఇవ్వడానికి వెళతాడు. ఆ విషయం కార్తీక్ కు తెలవదు. కానీ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నిద్ర పోతున్న వాళ్ల నాన్నను చూసి ఆశ్చర్యపోతాడు. ఇక కార్తీక్ ఇలా మనసులో అనుకుంటాడు.’ దేవుడా డాడీకి ఏమైంది. ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు అంటే.. నా గురించి బాధ పడుతున్నారా అంటూ మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు.

రూమ్ లోకి వస్తున్న తన తల్లి సౌందర్య ను కనిపెట్టిన కార్తీక్. ఆ రూం డోర్ వెనకాల కనపడకుండా ఉంటాడు. అలా తల్లిదండ్రులు తన కొడుకు గురించి బాధపడే ఈ విషయాన్ని దగ్గరుండి గమనిస్తాడు. అది గమనించిన కార్తీక్ కంటతడి పెట్టేస్తాడు. ఆనంద్ రావ్ కార్తీక్ గురించి చెప్పుకుంటూ చాలా పెద్దగా ఏడుస్తాడు. ఎప్పటికైనా మన కార్తీక్ మన దగ్గరికకే వస్తాడు అని సౌందర్య ధైర్యం చెబుతుంది.

రేపటి భాగం లో పకృతి వైద్యశాలకు దీప పిండివంటలు తీసుకొని వెళుతుంది. ఇక లోపలికి వెళ్ళిన దీపకు సౌందర్య, ఆనందరావ్ లు కనబడతారు. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel