Karthika Deepam April15 Today Episode: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత ఇంట్లో జ్వాలా ఫోన్ మర్చిపోవడానికి ఆనంద్ ఫోన్ తీసుకొని రావడానికి మోనిత ఇంట్లో కి వెళ్తాడు.
ఫోన్ కోసం మోనిత ఇంట్లోకి వెళ్లిన ఆనంద్ ని మొబైల్ ఫోన్ నా దగ్గర ఉంది అని చెప్పి పిలవడంతో ఆనంద్ కార్తీక్ ఫోటో చూడకుండానే వెళ్ళిపోతాడు. మరొకవైపు నిరూపమ్,ప్రేమ్ ఫోటో ఎగ్జిబిషన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ కి ఫోటో చేసి అమ్మ నేను ఎగ్జిబిషన్ కి బయలుదేరుతున్నాము అని చెబుతాడు.
మరొకవైపు హిమ, జ్వాలా కి ఫోన్ చేయడంతో ఏంటి తింగరి అని అనగా అప్పుడు హిమ నువ్వు తింగరి అని పిలుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది. ఆ తర్వాత నిరూపమ్, స్వప్న కలసి ప్రేమ్ ఫోటో ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ప్రేమ్, స్వప్న ని చూసి ఆనంద పడతాడు. అప్పుడు డాడీ వస్తే ఇంకా బాగుంటుంది అని అనడంతో స్వప్న కాపాడుతుంది.
ఇంతలోనే అక్కడికి హిమ రావడంతో, హిమ ను చూసిన స్వప్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్, తన తల్లిని సైలెంట్ గా ఉండమని చెబుతాడు. మరొకవైపు సత్య ని ఆటోలో జ్వాల పిలుచుకొని వస్తుంది. సత్య గేటు దగ్గరకు వచ్చి వెళ్ళి పోతాను అని అనడంతో, జ్వాలా సత్య చెయ్యి పట్టుకుని ఫోటో ఎగ్జిబిషన్ లోకి తీసుకొని వెళుతుంది.
సత్యను చూసిన స్వప్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్, సత్య ఫోటో ఎగ్జిబిషన్ కి రావడంతో సంతోష పడతాడు. అప్పుడు జ్వాలా ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో తింగరి ఫోటోలు పెడితే బాగుంటుంది అని అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. కానీ స్వప్న మాత్రం జ్వాలపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
రేపటి ఎపిసోడ్ లో భాగంగా గ్రూప్ ఫోటో కోసం జ్వాలా దగ్గరదగ్గరగా నిలబెడుతుంది. ఆ తరువాత నిరూపమ్,జ్వాలా కి థాంక్స్ చెప్పడం చూసిన స్వప్న నిన్ను నా కొడుకు నుంచి ఎలా దూరం చేయాలో నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు స్వప్న జ్వాలా ని కొట్ట బోతుండగా ఇంతలో నిరూపమ్ అడ్డుపడతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.