...
Telugu NewsEntertainmentManchu Vishnu: మంచు వారింట్లో ఆలూ పరాటాలు చేస్తున్న సన్నీ లియోన్.. వీడియో వైరల్!

Manchu Vishnu: మంచు వారింట్లో ఆలూ పరాటాలు చేస్తున్న సన్నీ లియోన్.. వీడియో వైరల్!

Manchu Vishnu: బాలీవుడ్ ఇండస్ట్రీలో శృంగార తారగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి సన్నీలియోన్ తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. గతంలో తెలుగులో మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమా ద్వారా గెస్ట్ పాత్రలో సందడి చేసిన సన్నీ లియోన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే గాలి నాగేశ్వరరావు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ క్రమంలోనే సన్నీలియోన్ హైదరాబాద్ లో సందడి చేస్తున్నారు.షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన విష్ణుతో కలిసి సరదాగా ఉన్నటువంటి ఈమె వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో భాగంగా సన్నీలియోన్ ఎంతో అందంగా తయారయి, సాంప్రదాయమైన దుస్తులను ధరించి వంట చేస్తూ అందరినీ సందడి చేశారు.

Advertisement

మంచు విష్ణు ఇంట్లో సన్నీ లియోన్ ఆలు పరాటాలు చేస్తున్నటువంటి ఈ వీడియో వైరల్ గా మారింది. మంచు విష్ణు సూచనల మేరకు సన్నీలియోన్ ఆలు పరాటాలు చేస్తూ మంచు విష్ణుతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఇక ఈ సమయంలో మంచు విష్ణు తన కాలేజీ రోజులను కూడా గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సన్నీలియోన్ తో కలిసి వంటలు చేస్తున్నటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు