Mike Tyson : సాధారణంగా సినీ సెలబ్రిటీలు లేదా అభిమాన క్రీడ సెలబ్రిటీలు ఎక్కడైనా కనబడితే వారితో కనీసం ఒక సెల్ఫీ అయినా దిగాలి అని చాలా మంది అభిమానులు తాపత్రయపడుతుంటారు.ఈ క్రమంలోనే సెలబ్రిటీలు బయట కనిపిస్తే చాలు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుని సెల్ఫీల కోసం పోటీపడుతుంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు సహనంతో అభిమానులకు సమాధానం చెబుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు.అయితే మరి కొందరు సహనం కోల్పోయి అభిమానుల పై చేయి చేసుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
ఈ విధంగా అభిమానుల పై చేయి చేసుకున్న సెలబ్రిటీలు అంటే టక్కున మనకు మన నందమూరి నటసింహం బాలయ్య బాబు గుర్తుకు వస్తారు.తాజాగా బాలయ్య బాబు బాటలోనే బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా తన అభిమాని పై చేయి చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మైక్ టైసన్ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుండీ ఫ్లోరిడా వెళ్ళే విమానంలో మైక్‌టైసన్ ప్రయాణిస్తున్నాడు.ఈ క్రమంలోనే ఆయన వెనుక సీట్లో ఉన్న ఒక కుర్రాడు తనని గుర్తుపట్టి తనతో మాట్లాడటానికి ఎంతో ప్రయత్నించారు.
Imagine being dumb enough to provoke Mike Tyson in the close proximity of a plane during a 3 hour flight😂😭🤦🏽♂️ pic.twitter.com/T3IBuB7lor
Advertisement— 🛸🐐Ziggy B🐐🛸 (@therealziggyb23) April 21, 2022
Advertisement
ఈ క్రమంలోనే మైక్ టైసన్ తో మాటలు పెట్టుకోగా ఆయన కూడా మొదట్లో నవ్వుతూ పలకరించారు. ఇక అతను వద్దన్నా వినకుండా అభిమాని తనతో మాట్లాడటానికి ఆత్రుత కనబరుస్తూ తనని ప్రశ్నల పై ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన మైక్ టైసన్ ఏకంగా వెనక్కి వచ్చి సదరు అభిమాని పై చేయి చేసుకున్నారు. ఇలా తాను చేయి చేసుకోవడంతో అక్కడున్న వారందరూ తనని అడ్డుకున్నారు. ఇకపోతే ఈ ఘటనలో సదరు అభిమాని తలకు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also :Viral Video: వామ్మో… ఆవు దూడను అమాంతం పట్టేసిన కొండచిలువ… వీడియో చూస్తే ఒళ్ళు జలదరించడం ఖాయం!