...

Karthika Deepam: ఇంట్లోనుంచి వెళ్ళిపోతున్న హిమ..దగ్గరవుతున్న నిరూపమ్, జ్వాలా.?

Karthika Deepam: తెలుగు బుల్లి తెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ నిశ్చితార్థం తనకు ఇష్టం లేదు అని చెప్పడంతో నిరూపమ్ ఫుల్ మందు తాగుతాడు.

ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ప్రేమ్,జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ హిమ తన కోసమే ఎంగేజ్మెంట్ వద్దు అని చెప్పిందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా కోపంతో డిలీట్ చేసిన ఫోటోలు అన్ని రికవర్ చేసుకుంటాడు.

ఇంతలో సత్య అక్కడికి వస్తాడు. అప్పుడు ప్రేమ్, ఆటోవాలా రాగానే మీరు అన్ని చెప్పకండి అని చెబుతాడు. ఇంతలోనే జ్వాలా సత్య కి భోజనం తీసుకొని వస్తుంది. మరొకవైపు సౌందర్య, హిమ దగ్గరికి వచ్చి నిశ్చితార్థం ఎందుకు ఆపేసావు అని గట్టిగా నిలదీస్తుంది.

సౌందర్య అడిగిన ప్రశ్నలకు హిమ సమాధానం చెప్పకపోవడంతో కోపంతో సౌందర్య, హిమ చంప పగలగొడుతుంది. అయినా కూడా సౌందర్య ఎంత చెప్పినా కూడా హిమ అసలు విషయం చెప్పదు. మరొక వైపు నిరూపమ్ ఫుల్ గా తాగి రోడ్డుపై కారులో పడుకుని ఉంటాడు.

ఇంతలో అటుగా వెళ్తున్న సౌర్య,నిరూపమ్ ని చూసి డాక్టర్ సాబ్ మీరు మందు తాగడం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు తాగిన మైకంలో నిరూపమ్, నేనంటే నీకు చాలా ఇష్టం కదా.. ఐ లవ్ యు అని చెప్పడంతో జ్వాల ఆనందంగా ఉంటుంది.

ఆ తరువాత నిరూపమ్ ని తన ఆటోలో ఎక్కించుకుని స్వప్న ఇంటికి తీసుకుని వెళ్తుంది. అయితే జ్వాల ని చూసిన స్వప్నా కోపంతో కసురుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఆ తర్వాత జ్వాలా దారిలో వెళుతూ నిరూపమ్ అన్న మాటలను గుర్తు చేసుకుని మురిసిపోతూ ఉంటుంది.

మరొకవైపు హిమ హాస్టల్ లో ఉంటాను నానమ్మ అని చెప్పి లగేజ్ సర్దుకుని బయలుదేరుతుంది. అప్పుడు సౌందర్య హిమ గా బుద్ధి చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఈ నిశ్చితార్థం ఆగిపోయి మంచి పని అయ్యింది అని స్వప్న నిరూమ్ కి లేనిపోని మాటలు చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత నిరూపమ్,జ్వాలా ని కలవగా డాక్టర్ సాబ్ మీరు మళ్ళీ ఎప్పుడు మందు తాగుతారు అని అడుగుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..