Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో పెళ్లి బట్టలతో హిమ,కార్తీక్,దీప ఫోటో ల దగ్గరికి వెళ్లి బోరున ఏడుస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో సత్య ప్రేమ్ కి కూడా సంబంధం చూస్తే సరిపోతుంది కదా అని స్వప్నతో అనగా అప్పుడు స్వప్న ప్రేమ్ కే కాదు నిరూపమ్ కూడా చూడాలి నిశ్చితార్థం జరగనివ్వను ఉంగరాలు కూడా నేనే తీసాను అని చెబుతుంది. ఇక నిశ్చితార్థం పీటల మీద కూర్చొని ఉన్న హిమ జ్వాలను చూసి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది.
తాంబూలాలు మార్చుకుంటున్న సమయానికి హిమ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అనడంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అప్పుడు సౌందర్య ఎంత చెప్పినా కూడా వినకుండా హిమ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. జరిగిన దానికి అందరూ బాధ పడుతూ ఉండగా స్వప్న మాత్రం ఆనంద పడుతూ ఉంటుంది.
అప్పుడు స్వప్న నిశ్చితార్థం వరకు తీసుకు వచ్చి అందరి ముందు నా పరువు నా కొడుకు పరువు తీసేశారు అని సౌందర్యని దెప్పి పొడుస్తుంది. ఆ తర్వాత హిమ నేరుగా తల్లిదండ్రుల ఫోటో దగ్గరికి వెళ్లి బోరున ఏడుస్తుంది. సౌర్య మనసులోని నిరూపమ్ ఉన్నాడు అని హిమ తెలుసుకుంటుంది. ఇక ఎలాగైనా నిరూపమ్ బావతో సౌర్య కు పెళ్లి చేస్తాను అని అనుకుంటుంది.
ఆ తరువాత సౌందర్య, హిమ చంపు పగలగొడుతుంది. మరొకవైపు నిరూపమ్ కారులో ఫుల్ గా తాగి ఉండటం చూసిన జ్వాల, మీరు తాగడం ఏంటి డాక్టర్ సాబ్ అని అడగగా.. తాగిన మత్తులో నిరూపమ్ నేను నీకు ఇష్టమే కదా ఐ లవ్ యు అని అనడంతో జ్వాలా సంతోషపడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World