David warner: ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రీడాభిమానులకు తెలిసే ఉంటుంది. వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే క్రీడాభిమానులతో పాటు సినీ అభిమానులకు తెలుగు వారికి కూడా వార్నర్ బాగా తెలుసు. గత ఐపీఎల్ సీజన్ వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉన్న వార్నర్… ఆ సమయంలోనే చాలా మందికి దగ్గరయ్యారు. ఇప్పుడు డిల్లీ జట్టుతో ఉన్నప్పటికీ తెలుగు వారు మాత్రం ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న సమయంలోనే వార్నర్ తెలుగులో హిట్ కొట్టిన సాంగ్స్ కు టిక్ టాక్ చేసే వాడు. కుటుంబ సమేతంగా డ్యాన్సులు చేస్తూ అలరించే వాడు. ఒక రకంగా తెలుగు ఇండస్ట్రీ గురించి దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా తెయడానికి వార్నర్ కూడా ఒక కారణమనే చెప్పాలి.
మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అలాగే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురములో సినిమా సాంగ్స్ కు డేవిడ్ భాయ్ స్టెప్పులు వేసి అలరించాడు. ఇక తాజాగా ఫేస్ యాప్ తో ఏకంగా చిరంజీవినే టార్గెట్ చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో మెగాస్టారా ఎంట్రీ సీన్ పై తను వీడియో చేసి సోషల్ మీడియో షేర్ చేశాడు.
ఈ వీడియో డేవిడ్ వార్నర్ తన అకౌంట్ లో షేర్ చేయగానే వైరల్ అయిపోయింది. డేవిడ్ వార్నర్ చేసిన ఈ వీడియో చూస్తుంటే డేవిడ్ భాయ్ తెలుగు సినిమాలను ఏ రేంజ్ లో ఫాలో అవుతున్నాడో తెలిసిపోతుంది.