...

Karthika Deepam:హిమతో ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటున్న నిరూపమ్..బాధలో జ్వాలా..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో జ్వాలా, సౌందర్య ల మధ్య ఫన్నీగా యుద్ధం జరుగుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా సౌందర్యతో మాట్లాడుతూ మొన్న మీ మనవరాలు బొమ్మ గీయించారు కదా దాని సంగతి ఏంటి అని సౌందర్యను అడగగా అప్పుడు సౌందర్య ఆర్టిస్ట్ ఫోన్ తీయడం లేదు నేనే వెళ్లి తెచ్చుకోవాలి అని చెబుతుంది. అప్పుడు జ్వాలా నేనే సౌర్య ని అని నాకు చెప్పాలి అనిపించినప్పుడే నీ దగ్గరికి వస్తాను నానమ్మ అని మనసులో అనుకుంటుంది.

ఇక ఆ తరువాత సౌందర్య అక్కడ నుంచి నేరుగా ఆర్టిస్ట్ దగ్గర బొమ్మ కలెక్ట్ చేసుకోవడానికి వెళుతుంది. ఇక సౌందర్య తన బొమ్మను ఎక్కడ చూస్తుందో అన్న భయంతో జ్వాలా కూడా అక్కడికి వెళుతుంది. అప్పుడు సౌందర్య నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడగగా, నేను కూడా ఒకరి బొమ్మ గీయిస్తున్నాను అని జ్వాలా అంటుంది.

నీకేం పని పాట లేదా నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నావు అని జ్వాలపై కోప్పడుతుంది. మరొకవైపు జ్వాలా కోసం ఇంద్రమ్మ ఇంట్లో హిమ ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ తరువాత ఇంటికి వచ్చిన జ్వాలా ఆ ఆర్టిస్ట్ ఇళ్ళు వదిలి వెళ్లిపోయిందట ఆ కాగితాలు అన్నీ కూడా చెత్త పేపర్లు ఏరుకునే వాడికి ఇచ్చేశారట.

ఎలా అయినా సరే వాడిని నేను పట్టుకుంటాను అని అని జ్వాలా అనడంతా హిమ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు నిరూపమ్,హిమకు ఎలా అయినా సరే తాను ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పాలి ఆ విషయంలో జ్వాలా హెల్ప్ తీసుకోవాలి అని చెప్పి జ్వాలా కి ఫోన్ చేస్తాడు. నిరూపమ్ కాల్ చేయగానే జ్వాలా ఎంతో సంతోష పడుతుంది.

అప్పుడు నిరూపమ్ ఒక చోట కలుద్దాం అని అనడంతో ఆనందంతో బయలుదేరిన జ్వాలా ఆటో డీజిల్ లేక మధ్యలోనే ఆగిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో సౌందర్యను లిఫ్ట్ అడుగుతుంది జ్వాలా. కానీ సౌందర్య మాత్రం కారు లో ఉన్న డీజిల్ పోసుకోమని చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏమి జరుగుతుందో చూడాలి మరి.