...

Karthika Deepam: సౌందర్య చెంప దెబ్బ రుచి చూసిన రుద్రాణి.. అత్తమామలను చూసిన వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పిల్లలు భయంతో కంగారు గా ఇంటికి వచ్చి రుద్రాణి పిల్లలకు లంచ్ బాక్స్ పంపించిన విషయం చెబుతారు. దీప పిల్లలకు ధైర్యం చెబుతుంది. రుద్రాణి ఆగడాలు తట్టుకోలేక ఎలాగైనా ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలని దీప మనసులో అనుకుంటుంది.

మరోవైపు పార్సల్ ఇవ్వడానికి వెళ్ళిన కార్తీక్ ఇవ్వకుండా తిరిగి వస్తాడు. తనతండ్రి తన గురించి బాధపడినందుకు పదే పదే ఆలోచించుకుంటూ వస్తాడు. తరువాత ప్రకృతి వైద్యశాల లో సౌందర్య, ఆనంద్ రావ్ లు గురువు సమక్షంలో ధ్యానం చేసుకుంటూ ఉండగా.. రుద్రాణి, తన తమ్ముడు ఇద్దరు కలిసి అక్కడకు వచ్చి ధ్యానాన్ని డిస్టర్బ్ చేస్తారు. దానికి సౌందర్య కు కోపం వచ్చి లాగి రుద్రాణి చెంపమీద ఒక్కటిస్తుంది.

ఆ తర్వాత రుద్రాణి, సౌందర్యకు నేనేంటో నీకు త్వరలోనే చూపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళుతుంది. ఇక అక్కడి నుంచి వేగంగా వెళుతున్న రుద్రాణి కారు పక్కనుంచి దీప వెళుతుంది. అలా కారు వేగంగా వెళ్లడం వల్ల దుమ్ము దీప పై పడుతుంది. దానికి దీప గట్టిగా అరుస్తుంది. అప్పుడు కారులోంచి రుద్రాణి తమ్ముల్లు దిగి బెదిరిస్తారు. దానికి అసహనం వ్యక్తం చేసిన దీప ముగ్గురు తమ్ముళ్లలో ఒకరికి లాగి చెంపమీద గట్టిగా ఇస్తుంది.

ఇక అక్కడి నుంచి రుద్రాణి తమ్ముళ్లు వెళ్ళిపోతారు. మరోవైపు మోనిత.. నన్ను రాక్షసి అన్న బస్తీ జనాలు ఇప్పుడు దేవత అంటున్నారు. మొన్నటిదాకా తిట్టిన వాళ్ళు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. పాపం.. దీపక్క అభిమాన సంఘాలలో మార్పు వచ్చింది క్రమంగా మోనిత అభిమానులుగా మారిపోతున్నారు అంటూ మోనిత విన్నీ కి చెప్పుకుంటూ తెగ సంబరపడిపోతుంది.

మరోవైపు దీప, రుద్రాణిని కొట్టిన మహానుభావురాలు ఎవరో అని చూడడానికి పకృతి వైద్యశాలకు వస్తుంది. తరువాయి భాగం లో దీప సౌందర్య, ఆనందరావులు ఉండే గది వైపు వెళ్లనే వెళుతుంది. గదిలో ఉన్న సౌందర్యను చూసి షాక్ అవుతుంది. మరోవైపు కార్తీక్, రుద్రాణి దగ్గరికి వెళ్లి ‘నా పిల్లలకు లంచ్ బాక్స్ పంపించడానికి నువ్వు ఎవరు అంటూ.. గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.

దానికి రుద్రాణి ఏమాత్రం జంకకుండా మాటలతో ఎదురుదాడి చేస్తుంది. ఇక రుద్రాణి, సౌందర్య చంప మీద కొట్టినందుకు గాను, దీప రుద్రాణి తమ్ములను చెంప మీద కొట్టినందుకు రేపటి భాగంలో ఎలాంటి పన్నాగం పన్నుతుందో చూడాలి.