Siri Shanmukh : బిగ్ బాస్ ఎంత మంది జనాలు చీదరించుకున్నా కానీ ఈ షోను చూసే వాళ్లు చూస్తేనే ఉన్నారు. చానెల్ కు వచ్చే వ్యూస్ వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ షో మాత్రం ఆగకుండా రన్ అవుతుంది. తాజాగా బిగ్ బాస్ షోలో హోటల్ టాస్క్ నడుస్తోంది. బిగ్ బాస్ టాస్క్ లంటేనే గొడవలకు ఫేమస్. ఎటువంటి గొడవ లేకపోతే ఎవరూ చూడరని కాబోలు బిగ్ బాస్ ఏదో ఒక గొడవ పెట్టిస్తూ ఉంటాడు. ఈ సారి టాస్క్ లో కూడా ఓ గొడవను బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. అది పూర్తిగా గొడవ కాకపోయినా కానీ గొడవ లాంటిదే.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. హోటల్ రూం టాస్క్ లో సిరి గెస్ట్ కాగా.. మరో కంటెస్టెంట్ సిరి దోస్త్ షణ్ముక్ ఆమెకు సేవకుడిగా చేస్తున్నాడు. సిరి షణ్ముక్ తో అన్ని పనులు చేయించుకుంటోంది. నిన్నటి ఎపిసోడ్ లో అయితే ఏకంగా తొడల మీద పడ్డ డ్రింక్ ను కూడా తుడిపించుకుంది. అలా సిరి షణ్ముక్ ను బాగా వాడుతుంది. కానీ ఈ రోజటి ఎపిసోడ్ లో సిరి షణ్ముక్ ను ఓ వింత ప్రశ్న అడిగింది.
నేను అందంగా ఉన్నానా? లేక సిరి అందంగా ఉందా? అని షణ్ముక్ ను ప్రశ్నించడంతో షణ్ముక్ మీరే అంటూ చెబుతాడు. మీకు చాలా వెయిట్ ఇస్తున్నారు కానీ మీరు చాలా యావరేజ్ ఫిగర్ అని మొహం మీదే చెబుతాడు. దీంతో సిరి ఒక్కసారిగా షాక్ కు గురవుతుంది. అసలు తన అందం గురించి షణ్ముక్ ఇలా ఎలా కామెంట్ చేస్తాడని విస్తుపోతుంది. సిరి పాపను అసలు బిగ్ బాస్ హౌజ్ లో ఫిగర్ కోసమే ఇన్నాళ్లూ ఉంచారని టాక్ నడుస్తోంది.
Read Also : RRR కనుక తేడాకొట్టిందో? రాజమౌళి పరిస్థితి ఇక అంతే..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world