RRR కనుక తేడాకొట్టిందో? రాజమౌళి పరిస్థితి ఇక అంతే..!

RRR Movie Fever :SS Rajamouli Experiment Goes Wrong Fans make disappointed
RRR Movie Fever :SS Rajamouli Experiment Goes Wrong Fans make disappointed

RRR Natu Natu Song : టాలీవుడ్ మోస్ట్ ఎవేయిటెడ్ మూవీ RRR అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే రిలీజయిన ఈ చిత్ర సాంగ్స్ ప్రమోషన్ వీడియోలు సినిమాపై విపరీతంగా క్రేజ్ పెంచాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా RRR ఫీవరే కనిపిస్తోంది. ఈ సినిమాను ఇప్పటి వరకు ప్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు టాలీవుడ్ లో మాత్రమే కాకుండా మొత్తం నేషనల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. అనేక మంది సినీ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.

సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే దూసుకుపోతుంది. అంతే కాకుండా ఇటీవలే ఈ సినిమాలోని నాటు, నాటు అనే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. త్వరలోనే ఫుల్ సాంగ్ రానున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ పాటపై కొంత మంది పెదవి విరుస్తున్నారు. సినిమా విషయంలో కూడా నిరాశతో ఉన్నారు. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో రాజమౌళి ఆడుకుంటున్నాడనే భావన కొంత మంది ఫ్యాన్స్ లో ఎక్కువవుతూ వస్తుంది.

Advertisement

అసలు సినిమాకు బలంగా మారాల్సిన ఫ్యాన్స్ మైనస్ అవుతారోమోనని చాలా మంది భయపడుతున్నారు. నాటు నాటు సాంగ్ విషయంలో కొద్ది మంది అభిమానులు పెదవి విరుస్తున్నారు. టాలీవుడ్ లోనే బెస్ట్ డ్యాన్సర్స్ అయిన చెర్రీ, తారక్ లు స్టెప్పులేస్తున్న ఈ పాట వీర లెవెళ్లో ఉండాలని లేకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని అనేక మంది హెచ్చరిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ RRR సినిమా మీద కూడా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read Also : Allu Arjun in Trouble : ఆ యాడ్‌లో చేసినందుకే ‘అల్లు అర్జున్‌’కు లీగల్ నోటీసులు.. ఆర్టీసీ ఎండీ సజ్జానార్ కీలక వ్యాఖ్యలు

Advertisement