Shravan Masam 2022 : తెలుగు క్యాలెండర్ ప్రకారం కొన్ని రోజుల్లో శ్రావణ మాసంలో అడుగుపెట్టబోతున్నాం. అంటే.. ఆగస్టు నెలాఖరులోకి దాదాపు ఎంటర్ అయ్యాం.. అయితే జూలై ఆఖరి నుంచి ఆగస్టు ప్రారంభ మాసానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే.. ఈ మధ్య మాసాన్ని హిందువులు పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ పవిత్రమైన మాసం పరమేశ్వరునికి చాలా ఇష్టమైనది కూడా. ఈ నెలలో ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు.
అయితే ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. అంటే జూలై శుక్రవారం 29వ తేదీన ప్రారంభమై ఆగస్టు 19 సోమవారం వరకు ఉంటుంది. ఈ మాసంలో సోమవారాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు చేస్తారు. హిందూ క్యాలెండర్ లోని పన్నెండు నెలల్లో శ్రావణమాసం ఐదవది. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శ్రావణమాసం ఈశ్వరునికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ఈ నెలలో ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ ఏడాది ఐదు సోమవారాలు వచ్చాయి. అయితే దీనికి ముందే చతుర్ మాసం ప్రారంభమైంది. ఇది నాలుగు నెలల పాటు ఉంటుంది. ఈ సమయంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని చాలామంది నమ్ముతారు. శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం కోసం ఏ విధమైన పూజలు చేయాలి. అనుగ్రహం కోసం ఏ పూజలు, పరిహారాలు చేయాలి. ఏ సమయంలో ఏం చేయాలని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Shravan Masam 2022 : శ్రావణ మాసంలో శివారాధన ఎలా చేయాలి.. శ్రావణ సోమవారాలెన్నంటే..
శివ పురాణం ప్రకారం.. శివ చతుర్దశి రోజున శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే క్షయ వ్యాధి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. పాలలో పంచదార కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే.. మీ మనసులో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రావణమాసం సోమవారం రోజున బిల్వ పత్రాలతో శివునికి నీటితో సమర్పించాలి. అనంతరం ఆ ఆకులను జేబులో వేసుకోవాలి. ఆ తర్వాత సాయంత్రం ఏదైనా చెట్టు వద్ద ఆకులను ఉంచాలి లేదా ఏదైనా కుండలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ పోతుంది. ఈ మాసంలోని అన్ని శనివారాలలో నూనె, నల్ల నువ్వులను దానం చేయాలి.
అంతేకాకుండా.. గొడుగులు, బూట్లు, చెప్పులను దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. శ్రావణమాసంలోని గురువారం నాడు పసుపు, శనగలు దానం చేస్తే గురు అనుగ్రహం కలుగుతుంది. శ్రావణమాసంలోని ప్రతిరోజు పవిత్రమైనది. శివునికి ఎంతో ప్రీతికరమైనది.. ఈ ఈ మాసంలో పరమశివునికి ఉపవాసం ఉంటే.. మీరు కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి. ఈ సందర్భంగా ఉపవాసం ఎప్పుడెప్పుడు ఉండాలంటే..
తొలి శ్రావణ సోమవారం 1 ఆగస్టు 2022
రెండో శ్రావణ సోమవారం, 8 ఆగస్టు 2022,
మూడో శ్రావణ సోమవారం 15 ఆగస్టు 2022,
నాలుగో శ్రావణ సోమవారం 22 ఆగస్టు 2022,
ఐదో శ్రావణ సోమవారం 29 ఆగస్టు 2022
ఈ మాసంలో పరమశివునితో పాటు పార్వతి దేవిని, మహాగణపతి, సుబ్రహ్మణ్యస్వామి, నాగ దేవతలు, గ్రామ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలా చేస్తే మీ ఇష్టమైన దేవతల అనుగ్రహంతో పాటు అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
Read Also : Sravana Masam 2022 : శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా?