Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య ఆయన డాయ్ ఫిలింస్ లో ఎక్కువగా నటిస్తున్నారు. ఈ మధ్యే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత హీరీష్ శంకర్ తెరకెక్కించిన మరో యాడ్ షూటింగ్ కు హాజరయ్యాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లోనే ఆస్ట్రాల్ పైపుల యాడ్ లో బన్నీ నటిస్తున్నారు. కాగా ఈ యాడ్ కు సంబంధించి తన లుక్ ను అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
చెవికి రెండు పోగులు, కొద్దిగా నెరిసిన జుట్టు, గడ్డం, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, నోటిలో సిగార్ తో రఫ్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఈ ఫొటోను షేర్ చేసిన కాసేపట్లో అభిమానులు లైకులు, రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. లుక్ అదుర్స్ అన్నా అని కొందరు, కొత్త లుక్ లో పుష్పరాజ్ వచ్చాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Advertisement— Allu Arjun (@alluarjun) July 29, 2022
Advertisement