Shekhar Master: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడమే కాకుండా ఏవైనా స్పెషల్ ఈవెంట్ లో శేఖర్ మాస్టర్ సందడి చేయడం మనం చూస్తున్నాము. ఇకపోతే హోలీ పండుగ సందర్భంగా స్టార్ మాలో ఈ హోలీకి తగ్గేదే లే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు, పలువురు కమెడియన్ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా శేఖర్ మాస్టర్ తన కూతురు సాహితితో కలిసి నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా నుంచి చంద్రుడిలో ఉండే కుందేలు అనే పాటకు డాన్స్ చేశారు. ఈ విధంగా తండ్రి కూతురు ఇద్దరూ కలిసి ఈ పాటకు డాన్స్ చేయటంతో పలువురు ఈ డాన్స్ వీడియో పై స్పందిస్తూ శేఖర్ మాస్టర్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ డాన్స్ వీడియో చూసిన దాదాపు 99 శాతం మంది వీరి డాన్స్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఒక్క శాతం మంది మాత్రమే విమర్శలు చేస్తున్నారు.
ఒక సీనియర్ జర్నలిస్ట్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా డాన్స్ పెర్ఫార్మెన్స్ పై స్పందిస్తూ అసలు అది తండ్రి కూతుర్ల డాన్స్ ఏంటో అంటూ విమర్శలు చేశారు.అయితే శేఖర్ మాస్టర్ ఎంపిక చేసుకున్న పాట సరైనది కాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరు దానికి మద్దతు పలకగా మరికొందరు ఆ పాటలో తప్పు ఏముంది అది రొమాంటిక్ సాంగ్ ఏం కాదు కదా అంటూ వారి అభిప్రాయాలను తెలియచేస్తున్నారు.ఏది ఏమైనా శేఖర్ మాస్టర్ తన కూతురుతో కలిసి డాన్స్ చేసినప్పటికీ ఈ విధంగా నెటిజన్ల నుంచి ట్రోల్స్ రావడం గమనార్హం.
Tufan9 Telugu News And Updates Breaking News All over World