Samantha: టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంతలు విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ జంట విడిపోయి దాదాపుగా ఆరు నెలలు అవుతున్న కూడా ఈ జంటకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అంతేకాకుండా విడాకులు తీసుకొని ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ జంట విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏమిటి అనే విషయంపై స్పందించలేదు. విడాకులు తీసుకున్న తరువాత స్నేహితులుగానే ఉంటాము అని ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని మరిచి ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వారి వారి కెరీర్ లో బిజీగా మారిపోయారు.
అయితే ఈ జంట మళ్లీ కలిస్తే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. అయితే నాగ చైతన్యతో విడిపోయినప్పటికీ, అక్కినేని కుటుంబ సభ్యులతో మాత్రం సన్నిహితంగా ఉంటోంది సమంత. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత అక్కినేని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఏప్రిల్ 9న అక్కినేని అఖిల్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ..హ్యాపీ బర్త్డే అఖిల్..ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలని దేవుడ్ని కోరుకుంటున్నా అంటూ ఫోటోను షేర్ చేసింది సమంత.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత అఖిల్ పై ఉన్న అభిమానంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటికీ అఖిల్ మాత్రం ఆ పోస్ట్ పై స్పందించలేదు. ఇకపోతే తీసుకున్న తర్వాత నాగచైతన్య, సమంతలు కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సమంత ప్రస్తుతం చేతిలో అరడజనకూడా పైగా సినిమాలతో బిజీ బిజీ గా వుంది. నాగ చైతన్య కూడా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. అంతే కాకుండా సమంత విడాకులు తీసుకున్న తరువాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తూ నిత్యం ఏదో ఒక రకమైన కొటేషన్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World