Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు సంపాదించిన సమంత, నాగ చైతన్యలు విడిపోయి దాదాపు 6 నెలలు అవుతోంది. ఇప్పటికీ ఈ జంట విడాకుల గురించి ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఈ జంటపై వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరు విడిపోయారు, మళ్లీ కలవబోతున్నారు అంటూ ఎన్నెన్నో వార్తలు. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరూ మల్లీ కలిస్తే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. ఇక మరో వైపు నాగ చైతన్యతో విడిపోయినప్పటికీ.. మిగతా కుటుంబ సబ్యులతో మాత్రం ఇప్పటికీ సన్నిహితంగానే ఉంటోంది సామ్.
తాజాగా అక్కినేని చైతన్య తమ్ముడు, అఖిల్ కు పుట్టిన రోజు శుభాకాక్షలు చెప్తూ ఓ పోస్ట్ చేసింది. నిన్న ఏప్రిల్ 9వ తేదీన సామ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ. “హ్యాపీ బర్త్ డే అఖఇల్. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలని దేవుడిని ప్రార్థిస్తున్నా” అంటూ అఖిల్ ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే సామ్ చేసిన ఈ పోస్ట్ పై మాత్రం అఖిల్ స్పందించలేదు.