...

Samantha Comments : స్టార్ హీరోపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దేవుడికి ఇష్టమైన వాడివంటూ..

Samantha Comments : సినీ ఇండస్ట్రీని ఊపెస్తున్న స్టార్ హీరోయిన్స్‌లో సమంతది స్పెషల్ ప్లేస్. ఇన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకే పరిమితమైన ఈ భామ.. అంతకంతకూ ఎదుగుతూ ప్రస్తుతం హాలీవుడ్‌లో సైతం మూవీకి సైన్ చేసింది. ఏమాయ చేశావే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ టైంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు స్టార్ హీరోలందరితో మూవీస్ చేసి తన టాలెంట్‌ను నిరూపించుకుంది. తాజాగా ఫామిలీ మెన్ అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసి నేషనల్ వైడ్ గా గుర్తింపు సంపాదించుకుంది.

అయితే మొదటి నుంచి అక్కనేని నాగచైతన్యతో లవ్‌లో ఉన్న ఈ అమ్మడు.. పెద్దలను ఒప్పించి చైను పెళ్లి చేసుకుంది. కానీ నాలుగేండ్లకు తన వివాహ బంధానికి దూరమైంది. వీరిద్దరూ దూరమై దాదాపు మూడు నెలలు కావస్తున్నా వీరు విడాకుల మ్యాటర్ ఏదో విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా అల్లుఅర్జున్ నటించిన పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్‌లో యాక్ట్ చేసింది. తన అందాలను ఆరబోస్తూ ఈ పాటలో కనిపించడంతో తన ఫ్యాన్స్ చాలా ఖుషీ అయ్యారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది.

తాజాగా రానా బర్త్ డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పింది సమంత. హ్యాపీ బర్త్‌ డే రానా.. నీకు ఎల్లప్పడు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నువ్వు శక్తివంతమైన పెద్ద మనసు ఉన్నవాడివి. దేవునికి ఇష్టమైన వాడివి అంటూ తన ఇన్ స్టా‌లో షేర్ చేసింది. ఇందుకు రానా స్పందిస్తూ.. థాంక్యూ సోమచ్ రూత్ అంటూ రిప్లై ఇచ్చాడు రానా. అయితే సమంత పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.. చైతన్యకు బర్త్ డే విషెస్ చెప్పలేదు కానీ, రానాకి చెబుతావా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : RGV Comments : ఈ టీవీలో రచ్చ చేసిన ఆర్జీవీ.. వాళ్ళందర్నీ పెళ్లి చేసుకుంటాడట!