Actress Udaya Bhanu : ఉదయభాను.. తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు టీవీ ప్రేక్షకులను ఈ పేరు చాలా సుపరిచితం. ఒకప్పుడు అనేక పోగ్రామ్స్ చేస్తూ టీవీలో కనిపించే ఈ అమ్మడు.. ఇప్పుడు చాలా వరకు దూరంగానే ఉంటున్నది. బుల్లి తెరపై ఒకప్పుడు ఓ రేంజ్‌లో బిజీగా ఉన్న ఈ భామ.. ఆ టైంలో టాప్ యాంకర్ గా పేరు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తన పర్సనల్ రీజన్స్ వల్ల యాంకరింగ్ కు దూరమైంది. యాంకర్ అంటే ఇలా ఉండాలి అంటూ చాలా మంది వీవర్స్ ఈమె గురించి చెప్పేవారు. సుమారు పదిహేను సంవత్సరాలకు పైగా చాలా ప్రోగ్రామ్స్ లో యాంకరింగ్ చేసి ఎంతో అలరించింది ఉదయభాను.
టీవీ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా.. సినీ వేడుకల్లోనూ యాంకరింగ్ చేసి అందరినీ ఆకట్టుకునేంది. పలు మూవీస్ లోనూ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు.. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన అఖండ మూవీ ప్రమోషన్స్ కోసం తిరిగి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ సక్సెన్ మీట్‌లో ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాలకృష్ణ లాంటి మహానుభావుడిని తెలుగు ఇండస్ట్రీలో ఇంత వరకు చూడలేదని చెప్పుకొచ్చింది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు.
మరో షోకి చాన్స్ ఇవ్వకపోయిన సరే.. ఈ మాట గుండెల మీరు చెయ్యి వేసుకుని చెబుతున్నానంటూ మాట్లాడింది ఉదయభాను. బాలయ్య బాబుకు ఎవరూ సాటి రారు. మీరు ఎప్పడు ఇలానే ఉండాలి. మీమ్మల్ని ఎవరైనా దగ్గర నుంచి చూస్తూ మీ కోసం వారి గుండెల్లో గుడి కట్టుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది. బాలయ్య, నేను చాలా ఈవెంట్స్ చేశాం. అప్పట్లో బాలయ్య, నాకు ఏదో జరిగిందంటూ చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఐ డోంట్ కేర్ అనుకుని వాటిని పట్టించుకోలేదు అని చెప్పింది.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world