RRR VFX Video : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దర్శకధీరుడు రాజమౌళి డెరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్, హాలీవుడ్ భామ ఒలీవియా కీలక పాత్రల్లో నటించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది మాత్రం ఇంటర్వెల్ సీన్ అనే చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఎంట్రీని రాజమౌళి ఓ రేంజ్ లో చూపించారు. ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య జరిగే పోరాట సన్నివేషాలకు ఆడియన్స్ మంత్ర ముగ్ధులు అయ్యారు.

ఇంత భారీ ఫైట్ ను రాజమౌళి ఎలా తీశాడు, వీఎఫ్ఎక్స్ ఎలా క్రియేట్ చేశారు, అని ప్రతి ఒక్కరికీ తెలుసుకోవాలని ఉంటుంది. తాజాగా మకుట వీఎఫ్ఎక్స్ సంస్థ ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి ఇంటర్వెల్ సీన్ కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. వీఎఫ్ఎక్స్ ఎలా యాడ్ చేశారో వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రేమికులను తెగ ఆకట్టుకుంటోంది.

Read Also : RRR Movie : ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు జక్కన్న.. సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా?