Guppedantha Manasu: సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని.. గౌతమ్ పై మండిపడ్డ రిషి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు దగ్గరికి వెళ్ళిన రిషి, వసు ని చూసి అనంద పడతాడు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసుతో మాట్లాడుతూ ఇంట్లో నుంచి వచ్చేసావు కనీసం ఎక్కడికి వెళ్తున్నావో కూడా చెప్పనేలేదు నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా.. నాకు ఎంత భయంగా ఉంది అంటూ రిషి తన మనసులోని మాటలను బయట పెడుతూ ఉంటాడు.

Advertisement

Advertisement

అప్పుడు వసు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్ అని అడగగా ఆటోడ్రైవర్ ని అడ్రస్ అడిగి ఇక్కడికి వచ్చాను అని చెబుతాడు. అన్ని విషయాలు బయట మాట్లాడుతావ నీ కొత్త రూమ్ చూపించవ అని అడగడంతో వసు, రిషి నీ తన రూమ్ కి తీసుకొని వెళుతుంది. మరొకవైపు దేవయాని సాక్షి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement

ఎలా అయినా సాక్షిని ఆయుధంగా మార్చుకుని వసు, జగతి ల అంతు చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సాక్షి ఫోన్ చేసి రిషి తనను పట్టించుకోవడం లేదు అని చెప్పడంతో దేవయాని ఆమెకుసర్ది చెబుతుంది. మరోవైపు రిషి, వసు రూమ్ కి వెళ్ళి నేను వసు నీ తిట్టాలి అని ఇక్కడికి వచ్చాను కానీ వసు నీ చూడగానే ఒక్క మాట కూడా రావడం లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు.

Advertisement

ఆ తరువాత వసు, రిషి కోసం అల్లం టీ పెట్టుకుని వస్తుంది. అలా వారిద్దరూ అల్లం టీ తాగుతూ కాసేపు ఫన్నిగా పొట్లాడుకుంటారు. ఆ తర్వాత రిషి వసు తో మాట్లాడి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరొకవైపు మహేంద్ర, జగతి రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు జగతి సాక్షి విషయంలో రిషి డిస్టర్బ్ అయ్యాడు అని చెబుతోంది.

Advertisement

ఇక వారిద్దరూ మాట్లాడుతూ ఉండగానే ఇంత రిషి వస్తాడు. అయితే బాధతో వస్తాడు అనుకుంటున్న రిషి ఆనందంతో రావడం చూసి వారిద్దరూ షాక్ అవుతారు. అప్పుడే ధరణి వచ్చి కాఫీ, టీ కావాలా అని అడగటంతో ఇప్పుడే అదిరిపోయే అల్లం టీ తాగి వచ్చాను అని ఆ టీ గురించి పొగుడుతూ అద్భుతంగా చెబుతాడు.

Advertisement

రిషిని చూసి మహేంద్ర ఆశ్చర్యపోతూ కనిపిస్తాడు. జగతి వసుకి ఫోన్ చేసి జాగ్రత్తలు అడుగుతుంది. పైగా రిషి అక్కడికి వచ్చాడు అని తెలియటంతో జగతి వాళ్ళు సంతోషపడుతారు. ఇక మరోపక్క గౌతమ్ వసు ఫోటో చూస్తూ వసు ను తలచుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి రిషి వచ్చి కాసేపు క్లాస్ పీకుతాడు. ఇక తను వసును మిస్ అవుతున్నాను అనటంతో రిషి కోపంతో రగిలిపోతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement