Rain forecast in hyderabad: హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరికలు!

నెల రోజులుగా ఎండలో మండిపోయిన ప్రజలు… ఈ రోజు చల్లటి వాతావరణం ఉపశమనాన్ని ఇస్తోంది. అయితే రోజూ ఎండలు, వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న వారంతా ఈరోజు బయటబయటే తిరుగుతూ… చల్ల దనాన్ని ఆనందిస్తున్నారు. అయితే ఆకాశం అంతా మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్‌ నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న గంటలో హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Advertisement

అయితే వర్షం కురిస్తే వాతావరణం అయినా చల్లబడుతుందని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇన్నాళ్లూ సూర్యుడి వేడిని భరించిన తమను కొన్ని చినుకులు తడిపినా బాగుండని కోరుకుంటున్నారు. మరో వైపు ఇప్పటికే హైదరాబాద్‌కు ఉత్తర, పడమర వైపు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. వర్ష సూచనలతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ అవకుండా చర్యలు చేపడుతున్నారు. కొన్ని రోజులుగా సూర్యుడి భగభగలతో అల్లాడిపోతున్న రాజధాని వాసులకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఉపశమనం లభించింది.

Advertisement