...

Astrology: రాహువు ప్రభావం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Astrology:మేష రాశి నుంచి మీన రాశి వారి వరకు ప్రతి ఒక్కరి పై నవగ్రహాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఈ క్రమంలోనేగ్రహాల కదలికలకు అనుగుణంగా ఆయా రాశుల పై కొన్ని సార్లు శుభ ఫలితాలు మరికొన్ని సార్లు అశుభ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు. మరి ఆ రాశులు వారు ఎవరూ ఇక్కడ తెలుసుకుందాం…

మిధునం: మిధున రాశి వారిపై రాహువు ప్రభావం ఉండటం వల్ల వీరికి అన్ని అదృష్ట సూచనలు కనబడుతున్నాయి. రాహువు ప్రభావం కారణంగా మిధున రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు చేపట్టిన ప్రతి ఒక్క పనిలోను విజయం సాధిస్తారు. ఇక రాహువు అనుగ్రహం మిధున రాశి వారిపై ఉండాలంటే శనివారం ఉపవాసం చేయడమే కాకుండా సోమవారం శివాలయానికి వెళ్లి శివుడిని పూజించాలి.

మకర రాశి: మకర రాశి వారికి రాహువు ప్రభావం విశేషమైన ఫలితాలను అందిస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం కష్టపడి పనిచేసే వాళ్లకు రాహువు శుభ ప్రభావాన్ని కలిగిస్తాడు. కనుక మకర రాశి వారు చేపట్టే పనులలో విజయాలను పొందుతారు. రాహువును ప్రసన్నం చేసుకోవడానికి మకర రాశి వారు శనివారం ఉపవాసం పాటించాలి.ఇక సోమవారం శివాలయానికి వెళ్లి స్వామివారి బిల్వ దళాలను నుంచి పూజ చేయటం వల్ల వీరికి అంతా మంచి జరుగుతుంది.