...

TS Police Jobs Alert: పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారా… అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

TS Police Jobs Alert: తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి 17 వేల పోస్టులకు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలోని ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పలు సూచనలు చేశారు. మరి ఆ సూచనలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకసారి అప్లై చేసిన తర్వాత మార్చుకోవడానికి వీలు లేదని ఎడిట్ ఆప్షన్ లేదని సూచించింది.అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ లో వివరాలన్నింటినీ నమోదు చేసిన అనంతరం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ నొక్కాల్సి ఉంటుంది.ఇలా దరఖాస్తు అప్లై చేసే సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే అందుకు పూర్తి బాధ్యత అభ్యర్థుల దేనని రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించారు.

చాలామంది ఫోన్ల ద్వారా అప్లికేషన్ నింపుతారు అయితే పొరపాటున కూడా అలా చేయకూడదు కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలియజేశారు.ఇక ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు మొదటి నుంచి ఒకటే ఫోన్ నెంబర్ ఉపయోగించాలని సూచించారు.అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో ఒక్కో పోస్టుకు ఒక్క ఫోన్ నెంబర్ ఇవ్వకుండా అన్ని పోస్టులకు ఒకటే ఫోన్ నెంబర్ ఇవ్వాలని సూచించారు.

అన్ని పోస్టులకు ఒకేసారి కాకుండా చివరి గడువు వరకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే హైట్ విషయంలో కూడా రిక్రూట్మెంట్ బోర్డ్ పలు కీలక సూచనలు చేశారు.ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే ఆదివాసి అభ్యర్థులు ఎత్తు 160 సెంటీమీటర్లు ఉంటే చాలని రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. ఆదివాసుల కాకుండా ఇతర వర్గానికి చెందిన వారు 167.6 ఎత్తు ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డ్ తెలియచేసింది.సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే అభ్యర్థులకు వయసు సడలింపు లేదని కేవలం స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వారికి మాత్రమే సర్వీస్ ఆధారంగా ఐదు సంవత్సరాలు వరకు మాత్రమే వయస్సు సడలింపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అభ్యర్థులకు ఈ సూచనలు చేశారు.